Odisha : రిక్షా కార్మికుడికి రూ. కోటి ఆస్తి ఇచ్చిన వృద్ధురాలు

తాము మంచిగా చూసుకుంటామని ఆ వృద్ధురాలికి చెప్పారు. ఆమెకు ఎందుకో డౌట్ అనిపించింది. తనకున్న ఆస్తులను కాజేసేందుకే దగ్గరయ్యారని, ఆస్తి కోసం ఆసక్తి చూపుతున్నారని గ్రహించింది.

Odisha : రిక్షా కార్మికుడికి రూ. కోటి ఆస్తి ఇచ్చిన వృద్ధురాలు

Odisha

Properties Worth Rs 1 Crore : అనారోగ్యంతో ఉన్న భర్త మృతి చెందాడు. అగ్ని ప్రమాదంలో కుమార్తెను కూడా కోల్పోయింది. దీంతో ఆమె ఒంటరి అయ్యింది. అప్పటి వరకు దూరంగా అన్నా దమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లు..దగ్గరయ్యారు. తాము మంచిగా చూసుకుంటామని ఆ వృద్ధురాలికి చెప్పారు. ఆమెకు ఎందుకో డౌట్ అనిపించింది. తనకున్న ఆస్తులను కాజేసేందుకే దగ్గరయ్యారని, ఆస్తి కోసం ఆసక్తి చూపుతున్నారని గ్రహించింది. వెంటనే ఆస్తిని తన వారికి కాకుండా..రిక్షా కార్మికుడికి ఇస్తున్నట్లు వీలునామా రాసింది. దాదాపు రూ. కోటికి పైగా ఉన్న ఆస్తులను ఆ రిక్షా కార్మికుడి కుటుంబానికి ధారాదత్తం చేసింది.

Read More : NZ vs AUS : తుది పోరుకు వేళాయే…ఆస్ట్రేలియా – న్యూజిలాండ్..ఏ జట్టు గెలిచేనో

ఈ ఘటన కటక్ లో చోటు చేసుకుంది. అయితే..ఆ రిక్ష కార్మికుడి కుటుంబానికే ఎందుకు ఆస్తులు ధారాదత్తం చేసిందనడానికి కారణాలు ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలోని కటక్ సమీపంలో సంబల్ పూర్ లోని సుతాహత్ క్రిస్టియన్ సాహిలో మినతి పట్నాయక్ (63) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. అన్నాదమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లు ఉన్నారు. కానీ..వీరి కుటుంబాన్ని పట్టించుకోలేదు. కుమార్తెకు ఘనంగా పెళ్లి చేయాలని భావించి..అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ..భర్త అనారోగ్య కారణాలతో 2020లో చనిపోయాడు. కుమార్తెతో మినతీ నివాసం ఉంటోంది. 2021లో ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో కుమార్తెను కోల్పోయింది. ఒక్కసారిగా అన్నాదమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లు దగ్గరయ్యారు.

Read More : Cyclone Jawad : ఏపీకి మరో తుపాన్ ముప్పు..భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక

తనకున్న ఆస్తిని కాజేసేందుకు దగ్గరయ్యారని మినతి పట్నాయక్ గ్రహించింది. ఎన్నో విషయాలు ఆలోచించి ఓ నిర్ణక్ష్ తీసుకుంది. రూ. కోటి విలువైన మూడంతస్తుల భవనం, ఇతర సామాగ్రీని రిక్షా కార్మికుడు బుడ సామల్ కుటుంబానికి ధారాదత్తం చేస్తూ..వీలునామా రాయించి..రిజిస్ట్రేషన్ చేయించింది. సామల్ కుటుంబం 25 ఏళ్లుగా తమకు తోడుగా ఉంటోందని..తన కుమార్తెను పాఠశాలకు తీసుకెళ్లేవాడని వృద్ధురాలు గుర్తు చేసుకుంది. మందులు, కూరగాయలు, నిత్యావసర సరుకులు కూడా తెచ్చేవాడని, తన భర్త అనారోగ్యానికి గురైన సమయంలో తమను ఆదుకోవడమే కాకుండా..ఎంతో సాయం చేశాడని వివరించింది. తమ కుటుంబానికి చేసిన సేవలకు ఏదో చేయాలని..భావించి..ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మినతి పట్నాయక్ తెలిపింది.