CM YS Sharmila : వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవడం ఖాయం-మాజీ ఎంపీ జోస్యం

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని మాజీ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ అన్నారు. ఐరన్ లేడీ అంటూ షర్మిలను ప్రశంసలతో ముంచెత్తారు డీఎస్. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవుతారని తాను 2003లోనే చెప్పానని గుర్తు చేశారు.(CM YS Sharmila)

CM YS Sharmila : వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవడం ఖాయం-మాజీ ఎంపీ జోస్యం

Ys Sharmila

CM YS Sharmila : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి అవడం ఖాయమని సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. సోమవారం వైఎస్ షర్మిల మాజీమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీఎస్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. షర్మిలతో భేటీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, అనుభవాలను డీఎస్ గుర్తు చేసుకున్నారు.

‘నా రాజకీయ అనుభవంతో చెబుతున్నా. షర్మిల ముఖ్యమంత్రి అవుతారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అవుతారని నేను 2003లోనే చెప్పా. భవిష్యత్తులో వైఎస్ఆర్ బిడ్డ షర్మిల తప్పకుండా ముఖ్యమంత్రి అవుతుంది. ఆమె ఒక ఐరన్ లేడీ’ అని డీఎస్ అన్నారు.

YS Sharmila : వైఎస్ఆర్ కు కేసీఆర్ తీరని అన్యాయం..రేవంత్ రెడ్డి మోసకారి : వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ అందరి మనిషి అని, తెలంగాణ ప్రజల్లో నేటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానం చెక్కు చెదరలేదని డీఎస్ చెప్పారు. సరైన సమయంలో ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉంటుందన్నారాయన. ఐరన్ లేడీ అంటూ షర్మిలను ప్రశంసలతో ముంచెత్తారు డీఎస్.

వైఎస్ షర్మిల భవిష్యత్తులో తెలంగాణ సీఎం కావడం ఖాయం అంటూ మాజీమంత్రి డీఎస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. వైఎస్ షర్మిల గతేడాది వైఎస్ఆర్‌టీపీని ఏర్పాటు చేసి తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని షర్మిల ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చేందుకు వైఎస్ఆర్‌టీపీని ఏర్పాటు చేసినట్లు షర్మిల చెబుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు షర్మిల. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ పాలన పైనే కాదు.. ప్రభుత్వం నిర్ణయాలు, విధానాలపైనా మండిపడుతున్నారు.

YS Sharmila : తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఎంత మంది చనిపోయారు? : వైఎస్ షర్మిల

వైఎస్‌, డీఎస్ క‌లిసి ప‌ని చేయడమే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. వైఎస్ సీఎల్పీ నేత‌గా ఉండ‌గా.. డీఎస్ పీసీసీ చీఫ్‌గా వ్యవహరించారు. 2004లో వీరిద్దరి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజయం సాధించింది. ఆ త‌ర్వాత వైఎస్సార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగా.. డీఎస్ ఆయ‌న కేబినెట్‌లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ప‌ని చేశారు. ఈ కాంబినేష‌న్‌లో కాంగ్రెస్ పార్టీ 2009లో మ‌రోమారు ఘన విజయం సాధించింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీఎస్.. టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మొన్నటివరకూ రాజ్యసభ్య సభ్యుడిగా కొనసాగారు.

YS Sharmila: ఇదే నా నియోజకవర్గం.. పోటీ చేసేది ఇక్కడి నుంచే.. ప్రకటించిన షర్మిల..

కాంగ్రెస్ పార్టీలో ఉన్న డీఎస్ ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికలకు ముందు డీఎస్ పై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కేసీఆర్ తో భేటీ అయి వివరణకు ఇచ్చేందుకు డీఎస్ ప్రయత్నాలు చేశారు. కానీ డీఎస్ కు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో టీఆర్ఎస్ కు ఆయన దూరంగా ఉన్నారు. కాగా, గతేడాది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో డీఎస్ భేటీ అయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారమూ జరిగింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw