Double Mask: డబుల్ మాస్క్ ఎంతో బెటర్.. కరోనాను కంట్రోల్ చేస్తుందా?

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారికి కట్టడి చేయలేమా? ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు కరోనాను నియంత్రించలేవా? కరోనా బారి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మాస్క్ ధరిస్తే కరోనాను ఆపగలదా?

Double Mask: డబుల్ మాస్క్ ఎంతో బెటర్.. కరోనాను కంట్రోల్ చేస్తుందా?

Fit Matters Most When Double Masking To Protect Yourself From Covid 19 (1)

Double Mask : ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారికి కట్టడి చేయలేమా? ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు కరోనాను నియంత్రించలేవా? కరోనా బారి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మాస్క్ ధరిస్తే కరోనాను ఆపగలదా? డబుల్ మాస్క్ ధరిస్తే కరోనాను నియంత్రించడం సాధమ్యేనా? ఇలాంటి అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక మాస్క్ ధరిస్తే కరోనాను ఆపలేమా? కచ్చితంగా అందరూ డబుల్ మాస్క్ ధరించాల్సిందేనా? అంటే.. మాస్క్ పై మాస్క్ ధరించడం వల్ల మంచిదేనంటోంది కొత్త అధ్యయనం. యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా హెల్త్‌ కేర్‌ జరిపిన కొత్త అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనాను కట్టడి చేయాలంటే ఒక్క మాస్క్‌ చాలదంట.. డబుల్‌ మాస్క్‌ ధరించడం వల్లే వైరస్‌ సోకకుండా అడ్డుకోగలమని సైంటిస్టులు తేల్చేశారు. మాస్క్‌లపై జరిపిన అధ్యయన ఫలితాలను JAMA ఇంటర్నల్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురితం చేశారు.

డబుల్‌ మాస్క్‌ ధరించడం వల్ల వైరస్‌ కణాలు ముక్కు, నోటి ద్వారా ప్రవేశించలేవని అధ్యయనంలో తేలింది. మాస్క్‌లలో పొరల సంఖ్య పెరగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, వాటిలో ఉన్న ఖాళీలు సరిగా పూడ్చినట్టుగా ఉండి ముఖానికి బిగువుగా ఉంటేనే వైరస్‌ ప్రభావం నుంచి తప్పించుకోగలమని పేర్కొంది. ఫిల్టర్ సామర్థ్యం కలిగిన పదార్థాలతో మెడికల్‌ ప్రొసీజర్‌ మాస్క్‌లు ఉన్నప్పటికీ ముఖాలకు సరిపోలవని అధ్యయనానికి నేతృత్వం వహించిన యూఎన్‌సీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అంటువ్యాధుల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎమ్లీ సిక్‌బెర్ట్‌ బెన్నెట్‌ పేర్కొన్నారు.

బట్టలతో నేసిన మాస్క్‌తో సర్జికల్‌ మాస్క్‌ను కలిపి వేసుకుంటే ఫలితాలు ఆశాజనకంగా వచ్చినట్టు అధ్యయనంలో రుజువైంది. మనుషుల ముఖాల్లో తేడాలను బట్టి ఈ మాస్క్‌ల సామర్థ్యం భిన్నంగా ఉంటుందని వెల్లడించారు. సర్జికల్‌ మాస్క్‌లు వైరస్‌ కణాలను అడ్డుకోవడంలో 40 నుంచి 60శాతం సమర్థతను కలిగి ఉన్నాయి. వస్త్రంతో తయారు చేసిన మాస్క్‌లు 40శాతానికి పైగా సమర్థతతో ఉంటాయని పేర్కొన్నారు.

సర్జికల్‌ మాస్క్‌పై క్లాత్ మాస్క్‌ను ధరించడం వల్ల వైరస్‌ను నిలువరించే సామర్థ్యం 20శాతం అధికంగా ఉన్నట్టు అధ్యయనంలో గుర్తించారు. క్లాత్ మాస్క్‌పై సర్జికల్‌ మాస్క్‌ను ధరిస్తే ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు. వదులుగా ఉన్న రెండు మాస్క్‌లను పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదని అంటున్నారు. సరిగా ఫిట్ అయ్యే ఒక మాస్క్‌ పెట్టుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు.