Ankita Lokhande-Vicky Jain: బీటౌన్‌లో పెళ్లిళ్ల సీజన్.. పెళ్లి పీటలెక్కుతున్న హాట్ కపుల్స్!

బాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు హాట్ కపుల్స్. ఇప్పుడిక అంకితా లోఖండే వంతొచ్చింది. మొదట సుశాంత్ సింగ్ తో లవ్ ఎఫైర్

Ankita Lokhande-Vicky Jain: బీటౌన్‌లో పెళ్లిళ్ల సీజన్.. పెళ్లి పీటలెక్కుతున్న హాట్ కపుల్స్!

Ankita Lokhande Vicky Jain

Ankita Lokhande-Vicky Jain: బాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు హాట్ కపుల్స్. ఇప్పుడిక అంకితా లోఖండే వంతొచ్చింది. మొదట సుశాంత్ సింగ్ తో లవ్ ఎఫైర్ నడిపి.. తర్వాత విక్కీతో నాలుగేళ్లు ట్రావెల్ చేసిన అంకిత చివరికి శుభం కార్డ్ వేసేసింది. ఏదో సింపుల్ గా కాదు.. ముంబైలో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసిందీ బ్యూటీ.

Shyam Singha Roy Trailer: హ్యూమన్ కాన్షెష్‌నెస్.. సింగరాయ్‌లా మారిన వాసు!

డిసెంబర్ 11 నుంచే ప్రీవెడ్డింగ్ ప్రొగ్రామ్స్ షురూ చేసింది అంకితా లోఖండే – విక్కీ జైన్ జంట. హల్డీ ఫంక్షన్, మెహందీ, ఎంగేజ్మెంట్, సంగీత్, కాక్ టెయిల్ పార్టీ ఇలా మస్త్ మస్త్ కలర వైబ్స్ తో ఎంజాయ్ చేసిన వీళ్లు.. మొత్తానికి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కంగనా రనౌత్, ఏక్తా కపూర్ వంటి బాలీవుడ్ స్టార్స్ తో పాటూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్య గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. కత్రినా – విక్కీ కౌషల్ పెళ్లి తర్వాత ఆ రేంజ్ లో అంకితా పెళ్లి గురించే బాలీవుడ్ ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు.

Janhvi Kapoor: అందాల నెరజాణ.. అదరహో అనిపిస్తున్న జాన్వీ!

ముంబై గ్రాండ్ హయత్ హోటల్ వీరి పెళ్లికి వేదిక కాగా.. బాలీవుడ్ స్టార్స్ విచ్చేసే అంకితా – విక్కీల రిసెప్షన్ మరింత గ్రాండ్ గా ప్లాన్ చేసారు. అయితే పూర్తిగా పెళ్లి తంతు మహారాష్ట్ర సంప్రదాయంలోనే సాగింది. మణికర్ణిక’, ‘భాఘీ’ సినిమాల్లో మెరిసిన అంకిత అంతకుముందు బాలీవుడ్‌ సీరియళ్లతో బాగా పాపులర్. కొవిడ్ టైంలో సూసైడ్ చేసుకున్న సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ జంటగా నటించిన పవిత్ర రిష్తా సీరియల్‌ బుల్లితెరపై ఓ సంచలనం. ఈ సీరియల్‌ షూటింగ్ టైంలోనే సుశాంత్‌- అంకితలు ప్రేమలో పడ్డారు. ఆరేళ్లపాటు లవ్ ట్రాక్ నడిపించారు. సుశాంత్‌ బ్రేకప్‌ తర్వాత యాక్టర్ విక్కీజైన్‌తో ప్రేమలో పడిన అంకిత.. ఎట్టకేలకు విక్కీనే పెళ్లి చేసుకుంది.

Chiru 155: మెగా దూకుడు.. మరో సినిమా ప్రకటించేశారు!

రాజ్ కుమార్ రావు – పత్ర లేఖ, విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్, అంకితా లోఖండే – విక్కీ జైన్.. ఇలా వరుసగా లవ్ కపుల్స్ పెళ్లి పీటలెక్కుతున్నాయి. నెక్ట్స్ ఎవరంటూ బాలీవుడ్ లో చర్చ మంచి వేడిమీదుంది. అందరి చూపు ఇప్పుడు రణ్ బీర్ – అలియాలపైనే ఉంది. అయితే ఇద్దరు చేతినిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా మారడంతో 2022 డిసెంబర్ లేదంటే 2023 జనవరిలో వెడ్డింగ్ డేట్ లాక్ చేసే ఛాన్స్ ఉంది. అయితే అది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ లా గ్రాండ్ గా కాకుండా.. సింపుల్ గా ఇరు ఫ్యామిలీల సమక్షంలో ప్లాన్ చేస్తున్నారు.