Chiranjeevi: సుమ అడ్డాలో ల్యాండ్ అయిన వాల్తేరు వీరయ్య.. మామూలుగా ఉండదట!

మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే, యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు చూపు ఆ సినిమాపైనే ఉంటుంది. ఇక చిరు తన సినిమాను ప్రమోట్ చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తుంటాడు. తాజాగా ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ప్రమోషన్స్‌లో చిరు మరో అడుగు ముందుకేశాడు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.

Chiranjeevi: సుమ అడ్డాలో ల్యాండ్ అయిన వాల్తేరు వీరయ్య.. మామూలుగా ఉండదట!

Chiranjeevi To Promote Waltair Veerayya In Suma Adda TV Show

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే, యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు చూపు ఆ సినిమాపైనే ఉంటుంది. ఇక చిరు తన సినిమాను ప్రమోట్ చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తుంటాడు. తాజాగా ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ప్రమోషన్స్‌లో చిరు మరో అడుగు ముందుకేశాడు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.

Chiranjeevi: మెగాస్టార్‌తో సినిమా ప్లాన్ చేస్తోన్న స్టార్ కొరియోగ్రఫర్.. వర్కవుట్ అయ్యేనా..?

ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జనవరి 8న నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. కాగా, తాజాగా ఈ సినిమాను బుల్లితెరపై కూడా ప్రమోట్ చేసేందుకు చిరంజీవి రంగంలోకి దిగాడు. ఆయన బుల్లితెరపై గతంలో ‘‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’’ గేమ్ షోను హోస్ట్ చేయగా, దానికి ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇప్పుడు మళ్లీ ఇంతకాలానికి చిరంజీవి బుల్లితెరపై మెరవనున్నారు.

Chiranjeevi: సంక్రాంతికి మెగాస్టార్ డబుల్ ట్రీట్.. ఎక్కడ చూసినా చిరంజీవే!

టాప్ యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న కొత్త షో ‘‘సుమ అడ్డా’’లో మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నాడు. ఈ మేరకు ఇప్పటికే ఈ మెగా ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. చిరు బుల్లితెరపై ఓ షోలో పాల్గొనడం నిజంగా విశేషం. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఫీట్ చేయని చిరు, ఇప్పుడు తన సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇలా బుల్లితెరపై కనిపిస్తుండటంతో ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.