Tollywood Star Hero’s: కొవిడ్ టైమ్.. మాంచి కిక్కిస్తున్న స్టార్ హీరోల లైనప్!

కొవిడ్ ఎఫెక్ట్, రిలీజ్ క్లాషెస్.. ఇలాంటి గందరగోళ పరిస్థితులతోనే 2021 గడిచిపోయింది. 2022 ప్రారంభం అలాగే ఉంది. గట్టిగా ఒక సినిమాను రిలీజ్ చేయాలంటేనే నానా తంటాలు పడుతున్నారు మేకర్స్.

Tollywood Star Hero’s: కొవిడ్ టైమ్.. మాంచి కిక్కిస్తున్న స్టార్ హీరోల లైనప్!

Tollywood Star Hero's

Tollywood Star Hero’s: కొవిడ్ ఎఫెక్ట్, రిలీజ్ క్లాషెస్.. ఇలాంటి గందరగోళ పరిస్థితులతోనే 2021 గడిచిపోయింది. 2022 ప్రారంభం అలాగే ఉంది. గట్టిగా ఒక సినిమాను రిలీజ్ చేయాలంటేనే నానా తంటాలు పడుతున్నారు మేకర్స్. అయితే కొవిడ్ ఎండామిక్ దశకు వచ్చేసిందనే టాక్ ఓవైపు వినిపిస్తుంటే.. అదే రేంజ్ లో సినిమా పండుగకు తెరలేపబోతున్నారు టాలీవుడ్ స్టార్స్. సినిమా మీద సినిమాలను పట్టాలెక్కిస్తూ 2022 నుంచి ఇండస్ట్రీని దున్నేస్తామంటున్నారు. ఒకటి, రెండు కాదు ఒక్కొక్కరి చేతిలో మూడు, నాలుగు మించే ఉన్నాయి సినిమాలు. ఆ లెక్కల కిక్కేంటో ఇప్పుడు చూసేద్దాం.

Raviteja: బాలీవుడ్‌పై మనసు పారేసుకున్న మాస్‌రాజా.. ఖిలాడీగా ఎంట్రీ!

టాలీవుడ్ స్టార్స్ లైనప్ సంగతి చెప్పాలంటే ప్రభాస్ లెక్కను ముందు తేల్చాసిందే. రెబల్ స్టార్ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తర్వాత లైనప్ స్పీడ్ పెంచేసారు. కొవిడ్ టైమ్ లోనూ వెంటవెంటనే షూటింగ్స్ లో పాల్గొంటూ హల్చల్ చేశారు. ప్రాజెక్ట్ను బట్టి 100 నుంచి 150 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న డార్లింగ్ చేతిలో ఇప్పుడు గట్టిగానే సినిమాలున్నాయి. 2018లోనే స్టార్ట్ అయిన రాధే శ్యామ్ ను పూర్తి చేసి రిలీజ్ కష్టాలు ఫేస్ చేస్తున్నారు ప్రభాస్. ఆది పురుష్ షూటింగ్ కంప్లీట్ చేశారు.. ఆగస్టులో రిలీజ్ అంటున్నారు. సలార్ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ప్రాజెక్ట్ కె కోసం క్లియర్ చేయాల్సింది చాలా ఉంది. ఆపై సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ప్రాజెక్ట్ ను లాంచ్ చేయాల్సి ఉంది గ్లోబల్ స్టార్.

Bheemla Nayak: పవర్ స్టార్ వచ్చేస్తున్నాడు.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

సెట్స్ పై ఉన్న సినిమాలు.. సెట్స్ పైకెళ్లబోతున్న సినిమాలే కాదు… మైత్రి బ్యానర్‌లో ఒక సినిమా, దిల్ రాజు బ్యానర్‌పై మరొక సినిమాతో పాటూ డివివి దానయ్యకు డార్లింగ్ కమిట్ మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్ తో ఓ మూవీ బాకీ ఉంది. సౌత్ ఇండియా కంటెంట్, సౌత్ ఇండియా హీరోస్ అంటే పెరిగిన క్రేజ్ ను ఇలా ఫుల్ గా క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు ప్రభాస్.

Actress Dressing: ట్రోలింగ్.. నెటిజన్స్ చేత తిట్లు తింటున్న స్టార్ హీరోయిన్లు!

ప్రభాస్ తర్వాత అంత స్పీడ్ చూపిస్తుంది మెగాస్టార్ మాత్రమే. ఆచార్య నుంచి చిరూ లెవెల్ పాన్ ఇండియా రేంజ్ కి పెరిగినా ఆశ్చర్యం లేదు. లోకల్ కంటెంట్ పై నార్త్ ఆడియెన్స్ మనసు పారేసుకుంటున్నారు కాబట్టి డబ్బింగ్ చేసి వదిలితే అయిపోతుందనే ఆలోచనలున్నాయి చిరూకి. ప్రస్తుతం 152 నుంచి 158 సినిమాల పనులతో ఫుల్ బిజీగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు మెగాస్టార్. ఒక్కో సినిమాకు భారీగా స్టార్ కాస్ట్ ను సెట్ చేసుకుంటూ దూకుడు చూపిస్తున్నారు.

Akhanda: బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ హీరోల పోటీ!

కమర్షియల్ సినిమాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చిరంజీవి. పెద్దగా ప్రయోగాలకు పోకుండా పక్కా మాస్ కంటెంట్ ను నమ్ముకుంటున్నారు. కొవిడ్ తో సినిమాలు వాయిదా పడుతున్నా చిరూ మాత్రం లైనప్ పెంచేస్తున్నారు. చరణ్ తో చేసిన ఆచార్య రిలీడ్ కి రెడీఅయింది. ఆపై 153వ సినిమాగా సల్మాన్ కాంబోలో గాడ్ ఫాదర్, 154వ సినిమాగా భోళాశంకర్, బాబీ డైరెక్షన్లో రవితేజ కాంబోలో 155వ సినిమా, వెంకీ కుడుముల – డివివి దానయ్య కాంబినేషన్లో 156వ సినిమాను లైన్లో పెట్టారు. ఇన్ని సినిమాలను క్యూలో పెట్టిన చిరూ.. 157, 158 సినిమాలకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. మారుతి డైరెక్షన్లో మెగా 157, అనిల్ రావిపూడి కాంబోలో మెగా 158 ప్రాజెక్ట్స్ ఉంటాయనే టాక్ ఊపందుకుంది.