Dasara Movie: మరికొద్ది గంటల్లో ‘దసరా’ మేనియా షురూ.. ఓటీటీలోకి దిగుతున్న ధరణి!
నాచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మూవీ ఇవాళ అర్ధరాత్రి నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Dasara Movie To Stream On OTT From Today Midnight
Dasara Movie: నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో నాని ఊరమాస్ అవతారం ప్రేక్షకును కట్టిపడేసింది. తెలంగాణ నేపథ్యంలో సాగిన ఈ మూవీ కథకు ప్రేక్షకులు పట్టం కట్టారు.
Dasara Movie: ఓటీటీలో ఎంట్రీ ఇస్తోన్న దసరా.. ఏ రోజు అంటే..?
ధరణి అనే పాత్రలో నాని పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందాల భామ కీర్తి సురేష్ ‘వెన్నెల’ పాత్రలో చేసిన పర్ఫార్మెన్స్కు మంచి మార్కులు పడ్డాయి. ఆకట్టుకునే రివెంజ్ డ్రామాగా ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన తీరు అందరికీ నచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.110 కోట్లకుపైగా వసూళ్లతో దుమ్ములేపిన దసరా మూవీ, ఇప్పుడు ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యింది.
Dasara Movie: దసరా నుండి ఓఎస్టీ రిలీజ్.. పండగ చేసుకోమంటున్న చిత్ర యూనిట్..!
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దసరా మూవీ డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుని, ఇవాళ అర్ధరాత్రి నుండి స్ట్రీమింగ్ చేయనుంది. దీంతో దసరా మూవీని మరోసారి చూసేందుకు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు. ధరణి పాత్రలో నాని నటవిశ్వరూపాన్ని ఇంట్లో కూర్చుని చూసేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. మరి ఓటీటీలో ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందో చూడాలి.
Okka rojulo Dharani gaadu vasthunnadu. Dasara thesthunnadu. #DasaraOnNetflix pic.twitter.com/DWyH0ONh9J
— Netflix India South (@Netflix_INSouth) April 26, 2023