F3: 4 డేస్ కలెక్షన్స్.. అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతున్న ఎఫ్3!

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్3 ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. రిలీజ్‌కు ముందే మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమా....

F3: 4 డేస్ కలెక్షన్స్.. అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతున్న ఎఫ్3!

F3 Movie 4 Days Collections

F3: దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్3 ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. రిలీజ్‌కు ముందే మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమా, రిలీజ్ రోజునే అదిరిపోయే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండటం, ఎఫ్2 సినిమాలోని తారాగణం మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ కావడంతో, ఈ సినిమాను చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఈ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో, ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని కనబరిచారు.

F3 Movie : F3 సినిమా మూడు రోజుల కలెక్షన్స్..

అయితే ఈ సినిమా తొలి వీకెండ్ ముగిసిన తరువాత ప్రపంచవ్యాప్తంగా రూ.34 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించి తన సత్తా చాటింది. ఈ సినిమాకు మండే నుండి అసలుసిసలు పరీక్ష ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ సోమవారం నాటి పరీక్షలో ఎఫ్3 సినిమా పూర్తిగా తన ఆధిపత్యం చూపించింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌నే కాకుండా రిపీటెడ్ ఆడియెన్స్‌తో ఈ సినిమా అన్ని చోట్లా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా నాలుగో రోజు కూడా వసూళ్ల వేటను కొనసాగిస్తూ దూసుకుపోయింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఎఫ్3 సినిమాకు పోటీగా మరే ఇతర సినిమా లేకపోవడం, ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఎంగేజింగ్ కామెడీతో ఈ సినిమా సమ్మర్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

F3: ఎఫ్3 రెస్పాన్స్‌పై చిత్ర యూనిట్ హ్యాపీ!

ఇక ఈ సినిమా నాలుగు రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్స్ ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 14.24 కోట్లు
సీడెడ్ – 4.23 కోట్లు
ఉత్తరాంధ్ర – 3.94 కోట్లు
గుంటూరు – 2.34 కోట్లు
ఈస్ట్ – 2.22 కోట్లు
వెస్ట్ – 1.73 కోట్లు
కృష్ణా – 2.05 కోట్లు
నెల్లూరు – 1.33 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 32.08 కోట్లు (రూ.51.40 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 2.02 కోట్లు
ఓవర్సీస్ – 5.70 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – రూ.39.80 కోట్లు (గ్రాస్ రూ.66.90 కోట్లు)