Godfather Movie: OTTలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ‘గాడ్‌ఫాదర్’.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ దసరా కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకోవడంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ‘గాడ్‌ఫాదర్’ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశాడు.

Godfather Movie: OTTలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ‘గాడ్‌ఫాదర్’.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

Godfather Streaming In Netflix OTT

Godfather Movie: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ దసరా కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించగా, ఈ సినిమాలో చిరు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో మెగా ఫ్యాన్స్‌కు థియేటర్లలో పూనకాలు వచ్చాయి. ఇక ఈ సినిమా కంటెంట్ పరంగా కూడా స్ట్రాంగ్‌గా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించింది.

Godfather: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసిన ‘గాడ్‌ఫాదర్’.. వచ్చేది ఎప్పుడంటే?

పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకోవడంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక వారి ఎదురుచూపులకు నేటితో తెరపడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ‘గాడ్‌ఫాదర్’ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశాడు. నవంబర్ 19న ఈ చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు గతంలోనే నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. చెప్పినట్లుగానే ఈ సినిమా నేడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Godfather: గాడ్‌ఫాదర్ ఫస్ట్ టైటిల్ కాదా..?

ఇక గాడ్‌ఫాదర్ సినిమాను థియేటర్లలో చూసిన వారు, చూడని వారు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. వీకెండ్ కావడం, బాస్ తన స్వాగ్, స్టయిల్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడంతో నెట్‌ఫ్లిక్స్‌లో గాడ్‌ఫాదర్ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ దక్కుతోంది. థమన్ సంగీతం మేజర్ అసెట్‌గా నిలిచిన ఈ సినిమాను ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్‌లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.