RRR Postpone: కొత్త సంవత్సరం కలిసొస్తుందనుకున్నా.. కలగానే మిగిల్చిన ఆర్ఆర్ఆర్

ఆడియెన్స్ మోస్ట్ అవైటైడ్ మూవీ.. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇద్దరు స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా.. 450 కోట్ల రిచ్ కంటెంట్ ఫిల్మ్.. అన్నీ ఉన్నా శని ఎక్కడో ఉందన్నట్టు..

RRR Postpone: కొత్త సంవత్సరం కలిసొస్తుందనుకున్నా.. కలగానే మిగిల్చిన ఆర్ఆర్ఆర్

Rrr

RRR Postpone: ఆడియెన్స్ మోస్ట్ అవైటైడ్ మూవీ.. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇద్దరు స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా.. 450 కోట్ల రిచ్ కంటెంట్ ఫిల్మ్.. అన్నీ ఉన్నా శని ఎక్కడో ఉందన్నట్టు.. థియేటర్స్ కి వచ్చేందుకు నానా తంటాలు పడుతోంది ట్రిపుల్ ఆర్. చివరికి కొత్త సంవత్సరం కలిసొస్తుందనుకున్నా.. అదీ కలగానే మిగిలింది. మళ్లీ వాయిదాపడ్డ ట్రిపుల్ ఆర్.. కొవిడ్ ఎఫెక్ట్ తో థియేటర్స్ కి రాలేమన్న రాజమౌళి.. 450 కోట్ల భారీ ప్రాజెక్ట్ ను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు 40 కోట్లు ఖర్చు పెట్టి మరీ ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేశారు జక్కన్న అండ్ టీమ్. ఆ ప్రమోషన్స్ లో వేరియేషన్స్ చూపించారు.. ఎమోషన్ టచ్ ఇచ్చారు. చివరికి జక్కన్న మాస్టర్ ప్లాన్స్ ప్రస్తుతానికి వర్కవుట్ కాలేదు. ముంచుకొస్తున్న ఒమిక్రాన్ ట్రిపుల్ ఆర్ మేకర్స్ ను మళ్లీ కష్టాల్లో పడేసింది. జనవరి 7న ఈ ప్యాన్ ఇండియా సినిమాను రిలీజ్ చేయలేమంటూ ప్రకటించారు.

Release Crash: కొత్త డేట్స్.. కొత్త క్లాషెస్.. మళ్లీ గందరగోళమేనా?

ఇప్పటికి నాలుగు సార్లు వాయిదాపడింది ట్రిపుల్ ఆర్. సినిమా మొదలైన తర్వాత 2020 జూలై 30న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. తర్వాత పాండెమిక్ తో 2021 సంక్రాంతి, ఆపై 2021 దసరాకు టార్గెట్ షిఫ్ట్ చేసారు. బట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం, కొవిడ్ పూర్తిగా తగ్గకకపోవడంతో మూడోసారి 2022 జనవరి 7 అని కొత్త డేట్ ప్రకటించారు. మేకర్స్ అంచనా ప్రకారం.. నెమ్మదిగా థియేటర్స్ లో రద్దీ పెరగడం, అఖండ, పుష్ప లాంటి సినిమాలు హ్యూజ్ సక్సెస్ సాధించడంతో రాజమౌళికి నమ్మకమొచ్చింది. అందుకే తగ్గేదే లే అంటూ నేషనల్ వైడ్ ప్రమోషన్స్ తో హల్చల్ చేశారు. బట్ ఇంక వారంలో రిలీజ్ అనగా.. ఒమిక్రాన్ దెబ్బకు మళ్లీ వెనక్కి తగ్గారు.

RRR Postpone: ఆర్ఆర్ఆర్ వాయిదా వెనుక మేకర్స్ లెక్కలివేనా?

రిలీజ్ రోజే ట్రిపుల్ ఆర్ 150 కోట్లు కలెక్ట్ చేయాలనేది రాజమౌళి డ్రీమ్. జనవరి 7న నేషనల్ వైడ్ అన్ని థియేటర్స్ లో ట్రిపుల్ ఆర్ బొమ్మ మాత్రమే ఉండేలా ప్లాన్ చేశారు. అటు ఓవర్సీస్ లోనూ ఏ ఇండియన్ సినిమా రిలీజ్ కానన్ని థియేటర్స్ లో జక్కన్న సినిమా దిగేలా చూశారు. తీరా డేట్ దగ్గరపడుతుంటే అమెరికా వంటి దేశాల్లో ఒమిక్రాన్ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. మనం దేశంలో కూడా పరిస్థితి మారుతోంది. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతులున్నాయి. ఆంధ్రలో టికెట్ రేట్ వల్ల బయ్యర్లు వెనకాముందాడుతున్నారు. వీటిని లెక్కచేయకుండా జనవరి 7నే ట్రిపుల్ ఆర్ ను తీసుకొస్తే.. దాదాపు 200 కోట్ల లాస్. సో ఈసారికి కూడా ఫ్యాన్స్ నిరాశపడక తప్పదన్నారు.