Telugu Films: టాలీవుడ్ బాట పట్టిన ఇంటర్నేషనల్ స్టార్స్! International Stars on the way to Tollywood Telugu Films

Telugu Films: టాలీవుడ్ బాట పట్టిన ఇంటర్నేషనల్ స్టార్స్!

తెలుగు సినిమాది ప్యాన్ ఇండియా లెవల్ మాత్రమే కాదు.. ప్యాన్ వరల్డ్ స్థాయి. అవును అందుకే గ్లోబల్ స్టార్స్ ఇక్కడి సినిమాల్లో కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Telugu Films: టాలీవుడ్ బాట పట్టిన ఇంటర్నేషనల్ స్టార్స్!

Telugu Films: తెలుగు సినిమాది ప్యాన్ ఇండియా లెవల్ మాత్రమే కాదు.. ప్యాన్ వరల్డ్ స్థాయి. అవును అందుకే గ్లోబల్ స్టార్స్ ఇక్కడి సినిమాల్లో కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనవాళ్లు అడగ్గానే కాదనకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడలా మన సినిమాల్లో మెరవనున్న ఇంటర్నేషనల్ స్టార్స్ పై ఓ లుక్.

Pushpa: రిలీజ్‌కు ముందే ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్న పుష్పరాజ్!

మన సినిమా కోసం ఇంటర్నేషనల్ స్టార్స్ వచ్చేస్తున్నారు. ఈమధ్యే కొత్త కలరింగ్ స్టార్చ్ చేసిన టాలీవుడ్.. గ్లోబల్ స్టార్స్ తో ఆ రంగులు వెయించాలనుకుంటోంది. రీసెంట్ గా చిరూ మూవీ కోసం బ్రిట్నీ స్పియర్స్ తో పాడించే వార్త నిజమేనన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ తో కలిసి స్టెప్పులేయబోతున్నారు. ఈ సాంగ్ కోసమే ఇంటర్నేషనల్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తో టచ్ లోకి వెళ్లారు. ఓ ఫారెన్ ఆడియో కంపెనీ బ్రిట్నీని ఈ విషయమై సంప్రదిస్తుందని.. ఆమెతో తెలుగు పాట పాడించాలా.. ఇంగ్లీషు ట్రాక్ రికార్డ్ చేయాలా అన్నది ప్రస్తుతం డిస్కషన్స్ లో ఉంది.

Sankranthi 2022: సంక్రాంతి సినిమా ఫైట్.. టాలీవుడ్ పెద్దల మంతనాలు?

ఇండియన్ స్క్రీన్స్ పై ఫస్ట్ టైమ్ మెరబోతున్నారు మైక్ టైసన్. గాడ్ ఆఫ్ బాక్సింగ్ గా పిలుచుకునే బీస్ట్ మైక్ టైసన్ ను లైగర్ కోసం రంగంలోకి దింపడమంటే అది గ్రేట్ స్టెప్పే. అదీ తెలుగు మేకర్ పూరీ జగన్నాథ్ ఇనిషియేటివ్ తీసుకోవడం అందరికీ స్వీట్ షాకిచ్చింది. ప్రజెంట్ యూఎస్ లో విజయ్ దేవరకొండతో లాస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసిన పూరీ.. ఇదే షెడ్యూల్ లో మైక్ టైసన్ ని డైరెక్ట్ చేయబోతున్నారు.

Anubhavinchu Raja: ప్రామిసింగ్ ట్రైలర్‌తో పాజిటివ్ వైబ్స్ తెచ్చిన రాజ్ తరుణ్!

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తన 25వ సినిమాను ప్లాన్ చేసిన ప్రభాస్ ప్రతీది స్పెషల్ గా ఉండేలా కేర్ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ స్పిరిట్ ప్రాజెక్ట్ లో కొరియన్ హీరోయిన్ అన్న వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. కొరియన్ టీవీ డ్రామాలతో ఫేమ్ సంపాదించుకున్న సాంగ్ హై క్యోను ఈ మూవీలో హీరోయిన్గా ఎంపిక చేసినట్టు ఫిలీం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిఉంది.

Evaru Meelo Koteeswarulu : కోటి రూపాయలు గెలిచినా చేతికి వచ్చేది ఇంతే..

ఇక ట్రిపుల్ ఆర్ సినిమాతో ఒలివియా మోరీస్ అట్రాక్ట్ చేయబోతుంది. ఎన్టీఆర్ జోడీగా ఒలివియా సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయబోతుంది. రీసెంట్ గా రిలీజైన నాటు నాటు సాంగ్ లో తన క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషెన్స్ తో ఆడియెన్స్ ను ఫిదా చేసిందీ హాలీవుడ్ బ్యూటీ.

Rajinikanth : ‘అన్నాత్తే’ స్టోరీ విని ఏడ్చేశాను : రజినీకాంత్

టాప్ ప్రొఫెషనల్ వ్రెజ్లర్.. ప్రెజెంట్ హాలీవుడ్ పాపులర్ యాక్టర్ డ్వైన్ జాన్సన్ కూడా ఇండియన్ సినిమాపై మనసు పారేసుకున్నాడు. మంచి ఆఫర్ వస్తే ఇక్కడి సినిమాలో కనిపించేందుకు సిద్ధమేనన్నాడు. రీసెంట్ ఓటీటీ రిలీజ్ రెడ్ నోటిస్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ మాట చెప్పిన డ్వైన్ జాన్సన్ కోసం సూపర్ రోల్ ప్లాన్ చేసే పనిలో ఉన్నారు మన మేకర్స్.

×