Balayya – Mahesh : బాలయ్య – మహేష్ మల్టీస్టారర్..

నటసింహా బాలకృష్ణ - సూపర్‌స్టార్ మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్‌లో కొరటాల శివ సినిమా!..

Balayya – Mahesh : బాలయ్య – మహేష్ మల్టీస్టారర్..

Balayya Mahesh

Balayya – Mahesh: ఎన్టీఆర్ – ఏఎన్నార్.. కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు జనరేషన్‌లో మల్టీస్టారర్ సినిమాలకు కొదువుండేది కాదు. తర్వాత తరంలో స్టార్‌డమ్‌ని బట్టి ఎవరికి వాళ్లు సోలోగా సినిమాలు చేస్తూ వచ్చారు తప్ప మల్టీస్టారర్ చిత్రాలు చేసిన దాఖలాలు లేవు.

RRR Movie : ఇదీ తెలుగు సినిమా సత్తా.. ప్రపంచవ్యాప్తంగా పదివేలకు పైనే..

ఇప్పుడు కాలం మారింది. మారుతున్న ట్రెండ్‌తో పాటు మన హీరోలూ మారుతున్నారు. టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.. పవర్‌స్టార్ కళ్యాణ్, హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ‘ఆచార్య’, ‘భీమ్లా నాయక్’ సినిమాల మీద మాంచి హైప్ ఏర్పడింది.

Balakrishna – Krish : క్రేజీ కాంబో.. గీతా ఆర్ట్స్‌లో బాలయ్య సినిమా!

ఇప్పుడలాంటి ఓ క్రేజీ కాంబినేషన్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. ‘ఆచార్య’ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల కలయికలో ఓ సినిమా ఉంది. దాని తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణతో సినిమా చెయ్యబోతున్నారని, ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని ఇటీవలే వార్తలు వచ్చాయి.

Pushpa Movie : ఐకాన్ స్టార్ క్రేజ్ పీక్స్.. తమిళనాడులో థియేట్రికల్.. మలయాళంలో శాటిలైట్ రైట్స్ ఎంతంటే..

ఇప్పుడు వినిపిస్తున్న మరో క్రేజీ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో బాలయ్యతో పాటు మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నాడట. అవును.. బాలయ్య బాబుతో పాటు సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా ఈ మూవీలో నటించబోతున్నాడట. ఇద్దరు హీరోల ఇమేజ్‌కి తగ్గట్టు కొరటాల బ్రహ్మాండమైన స్క్రిప్ట్ రెడీ చేశారని అంటున్నారు.

Romantic Movie : ‘ఆహా’ లో రొమాంటిక్..

ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా పూర్తవ్వగానే.. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసి.. బాలయ్య – మహేష్‌లకు వినిపించి ఈ క్రేజీ ప్రాజెక్టుని అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. ‘అఖండ’ డిసెంబర్ 2న, ‘ఆచార్య’ 2022 ఫిబ్రవరి 4, ‘సర్కారు వారి పాట’ ఏప్రిల్ 1న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Sarkaru Vaari Paata : ఏప్రిల్ 1న ‘సర్కారు వారి పాట’