HariHara VeeraMallu : అసలే మూడేళ్ళుగా వాయిదాల మీద వాయిదాలు.. ఇప్పుడు ఇలా.. హరిహరవీరమల్లు పూర్తవుతుందా?

మూడేళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ హిస్టారికల్ డ్రామా మాత్రం రకరకాల రీజన్స్ తో పోస్ట్ పోన్ అవుతూ ఆగిపోతూనే ఉంది. ఫస్ట్ లో సెట్స్, పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో డిలే అయ్యింది.

HariHara VeeraMallu : అసలే మూడేళ్ళుగా వాయిదాల మీద వాయిదాలు.. ఇప్పుడు ఇలా.. హరిహరవీరమల్లు పూర్తవుతుందా?

Pawan kalyan HariHara VeeraMallu Movie postponed again due to fire accident

Pawan kalyan :  ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ హరిహర వీరమల్లు(HariHara VeeraMallu) సినిమా రోజు రోజుకీ లేట్ అవుతూనే వస్తోంది. పవన్ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎన్ని సినమాలు చేస్తున్నా హరిహర వీరమల్లు మీద మాత్రం స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు ఫాన్స్. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని జనాలు వెయిట్ చెయ్యడమే కానీ అసలు సినిమా రిలీజ్ కాదు కదా షూటింగ్ కంప్లీట్ అయ్యే ఛాన్సే కనిపించడం లేదు.

ఇక డిలే అయ్యే ఛాన్స్ లేదు అని వర్క్ షాప్ మొదలుపెట్టి ఓ రెండు షెడ్యూల్స్ కూడా షూటింగ్ చేశారు. మళ్ళీ ఏమైందో కానీ ఆ షూటింగ్ పక్కన పెట్టి పవన్ వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునేలోపు హరిహర వీరమల్లు సెట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది.

జూన్ నుంచి స్టార్ట్ అవ్వాల్సిన సెట్ కాలిపోయిందని దాంతో షూటింగ్ మరో సారి డిలే అయ్యిందని వార్తలు నడుస్తున్నాయి. నిజానికి ఈ యాక్సిడెంట్ దుండిగల్ షెడ్యూల్ టైమ్ లో వేసిన సెట్ అని, దాన్లో షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందని చెబుతోంది టీమ్. మొన్నటి వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన హరిహరవీరమల్లు షూటింగ్ ప్రస్తుతానికి బ్రేక్ తీసుకొంది.

మూడేళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ హిస్టారికల్ డ్రామా మాత్రం రకరకాల రీజన్స్ తో పోస్ట్ పోన్ అవుతూ ఆగిపోతూనే ఉంది. ఫస్ట్ లో సెట్స్, పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో డిలే అయ్యింది. ఆ తర్వాత హిస్టారికల్ మూవీ కాబట్టి జనరల్ గానే కాస్త టైమ్ పడుతుందని, ఎలాగోలా షూటింగ్ కంటిన్యూ చేద్దామని డైరెక్టర్, ప్రొడ్యూసర్ ప్లాన్ చేసి షూట్ ని స్పీడప్ చేసే టైమ్ లో సముద్రఖని సినిమా అడ్డం అయింది. తక్కువ డేట్స్ కావడంతో హరిహర వీరమల్లుని పక్కన పెట్టి సాయి ధరమ్ తేజ్ తో కలిసి సముద్రఖని సినిమాకి డేట్స్ ఇచ్చి అక్కడ ఎంగేజ్ అవ్వడంతో హరిహర వీరమల్లు డిలే అయ్యింది. ఆ సినిమా కంప్లీట్ చేసిన పవన్ ఆ తర్వాత OG కి డేట్స్ ఇచ్చారు. జూన్ నుంచి హరిహర వీరమల్లుకి డేట్స్ ఇచ్చారు పవన్. ఈ సారి షూట్ లో పెద్ద షెడ్యూల్ ని కంప్లీట్ చెయ్యడానికే ప్లాన్ చేసుకుంది యూనిట్. కానీ ఇలా అఫైర్ యాక్సిడెంట్ అని షూట్ కి బ్రేక్ పడిందని వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ ఆ సెట్ లో షూటింగ్ అయిపోయింది అంటున్నా ఫ్యాన్స్ కంగారు పడొద్దని అలా చెప్తున్నట్టు సమాచారం. సినిమా మరింత లేట్ అవుతుందని తెలియకూడదని అలా చెప్తున్నారట అని టాక్ నడుస్తుంది.

Nikhil Siddhartha : ఆ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరో నిఖిల్.. సైడ్ హీరో నుంచి పాన్ ఇండియా దాకా..

ఇప్పటికే 50 శాతంకి పైగా షూటింగ్ కంప్లీట్ అయిన హరిహరవీరమల్లు సినిమా 17వ శతాబ్దపు నాటి బ్యాక్ డ్రాప్ లో మొఘలాయిలు, కుతుబ్ షాహీల పీరియడ్ ని స్క్రీన్ మీద చూపించబోతోంది. జానపద బ్యాక్ డ్రాప్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ వీడియోలు రిలీజ్ చేయగా ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. ఫస్ట్ వీడియోలో కోరమీసం కత్తితో కనిపించిన పవన్ సెకండ్ వీడియోలో తొడగొడుతూ, అడ్డొచ్చిన వాళ్లను పడగొడుతూ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేశారు. ఎంత డిలే అవుతూ ఉన్నా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే డిఫరెంట్ గా చేస్తున్న హరిహరవీరమల్లు సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ మాత్రం వెయిట్ చేస్తూనే ఉన్నారు. మరి మూడేళ్ళుగా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నా ఈ సినిమా ఎప్పటికొస్తుందో. నెక్స్ట్ ఇయర్ నుంచి పవన్ అస్సలు సినిమాలకు డేట్స్ ఇచ్చే ప్రసక్తే లేదు. వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ ఉండటంతో ఈ సంవత్సరం చివరిలోపే సినిమాలన్నీ పూర్తి చేయాలి. అన్నీ పూర్తి అయినా హరిహరవీరమల్లు మాత్రం డౌట్ అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు.