Pooja Hegde Brother Marriage : పూజాహెగ్డే అన్నయ్య వివాహం.. ఎమోషనల్ అయిన పూజ..

తాజాగా పూజా హెగ్డే అన్నయ్య రిషబ్ హెగ్డే వివాహం జరిగింది. రిషబ్ హెగ్డే డాక్టర్ గా పనిచేస్తున్నాడు. శివాని అనే అమ్మాయిని గత కొన్నేళ్లుగా ప్రేమించి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో.................

Pooja Hegde Brother Marriage : పూజాహెగ్డే అన్నయ్య వివాహం.. ఎమోషనల్ అయిన పూజ..

Pooja Hegde Brother Marriage :  స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా అంది. తమిళ్, తెలుగు, బాలీవుడ్ పరిశ్రమలలో పూజా చేతిలో సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్స్ తో బిజీబిజీగా ఉంది. ఈ బిజీ నుంచి ఒక వారం రోజులు గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో సమయం గడిపింది. ఎందుకు అనుకుంటున్నారా? తాజాగా పూజా హెగ్డే అన్నయ్య రిషబ్ హెగ్డే వివాహం జరిగింది.

రిషబ్ హెగ్డే డాక్టర్ గా పనిచేస్తున్నాడు. శివాని అనే అమ్మాయిని గత కొన్నేళ్లుగా ప్రేమించి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో తాజాగా వీరి వివాహం జరిగింది. ముంబైలోని ఓ ప్రైవేట్ హోటల్ లో రిషబ్ హెగ్డే వివాహం ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ వివాహానికి విచ్చేశారు.

Harish Shankar : పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తున్నారు.. హరీష్ శంకర్ సంచలన కామెంట్స్..

రిషబ్ హెగ్డే, శివాని వివాహానికి చెందిన కొన్ని ఫొటోలు పూజా హెగ్డే షేర్ చేస్తూ.. నా సోదరుడు తన జీవితంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వారం అంతా చాలా సరదాగా సాగింది. నేను సంతోషకరమైన కన్నీళ్లతో ఏడ్చాను, చిన్నపిల్లలా నవ్వాను. అన్నా, నువ్వు నీ జీవితంలో నెక్స్ట్ దశలోకి అడుగుపెడుతున్నప్పుడు, ప్రేమ, ఆనందం, శాంతితో పూర్తిగా ఆస్వాదిస్తావని భావిస్తున్నాను. శివాని నువ్వు అందమైన, అద్భుతమైన అమ్మాయివి. మా కుటుంబంలోకి నీకు స్వాగతం అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. ప్రస్తుతం రిషబ్ హెగ్డే, శివాని పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో పూజా హెగ్డే కూడా సందడి చేసింది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)