Salaar: సలార్ కోసం ప్రశాంత్ నీల్ భారీగా ప్లాన్ చేస్తున్నాడట!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌గా తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ కొత్త వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

Salaar: సలార్ కోసం ప్రశాంత్ నీల్ భారీగా ప్లాన్ చేస్తున్నాడట!

Prashant Neel Planning Big For Salaar Promotions

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌గా తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ కొత్త వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

Salaar : టీజర్ కూడా రిలీజ్ కాకముందే.. రికార్డు సృష్టించిన సలార్!

సలార్ సినిమాపై నెలకొన్న అతిభారీ అంచనాలను ఏమాత్రం తక్కువ కాకుండా ఉండేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ అప్పుడే భారీ ప్లానింగ్ చేస్తున్నాడట. ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ సినిమా రిలీజ్‌కు మూడు నెలల ముందు నుండే, ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రశాంత్ నీల్ మాస్టర్ స్కెచ్ వేస్తున్నాడట. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటివరకు కనీవిని ఎరగని రీతిలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌కు అనుగుణంగా ప్రమోషన్స్‌తో అభిమానుల్లో ఓ ఊపు తీసుకొచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నాడు.

Salaar: ‘సలార్’పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

ఇందులో భాగంగా సమ్మర్‌లో టీజర్, గ్లింప్స్ వీడియో, సలార్ పోస్టర్లతో దుమ్ములేపాలని ప్రశాంత్ నీల్ చూస్తున్నాడు. ఇక సినిమాపై జనంలో అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్లేలా ఆయన ఈ ప్రమోషన్స్ చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అటు సలార్ రిలీజ్ టైమ్‌లో మరే ఇతర మూవీ కూడా రిలీజ్ కాదు అనే ధీమాతో, ఈ చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా ప్రచారంతో హోరెత్తించాలని ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా సలార్‌తో ప్రశాంత్ నీల్ ఇండియా లెవెల్‌లో మరో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడనే వార్త ఇప్పటికే సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.