YouTube Records: రిలీజ్‌కు ముందే రికార్డులు.. స్టార్ హీరోలకు సోషల్ మీడియా పరీక్ష! Pre release YouTube Record.. Social media test for star heroes!

YouTube Records: రిలీజ్‌కు ముందే రికార్డులు.. స్టార్ హీరోలకు సోషల్ మీడియా పరీక్ష!

థియేటర్ కు వెళ్లాక బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు.. రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో దుమ్ము దులపడం కూడా ఇప్పుడు బాగా అలవాటైంది. స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు.. రికార్డులు కొట్టడానికి ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు.

YouTube Records: రిలీజ్‌కు ముందే రికార్డులు.. స్టార్ హీరోలకు సోషల్ మీడియా పరీక్ష!

YouTube Records: థియేటర్ కు వెళ్లాక బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు.. రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో దుమ్ము దులపడం కూడా ఇప్పుడు బాగా అలవాటైంది. స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు.. రికార్డులు కొట్టడానికి ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. టీజర్, సాంగ్స్, ట్రైలర్.. ఏది రిలీజైనా వ్యూస్, లైక్స్, షేర్స్ అంటూ ట్రెండ్ చేసేస్తున్నారు. మరి సర్కారు వారి పాట ట్రైలర్ తర్వాత ఈ సోషల్ రికార్డుల నంబర్ గేమ్ ఎలా ఉందో ఓసారి చూద్దాం.

Sakaru Vaari Paata: యూట్యూబ్‌ను అల్లాడించేసిన మహేష్!

తమ అభిమాన హీరో సినిమా వస్తుందంటే దానికి సంబంధించిన ప్రతి విషయం హైలైట్ చేయాలనుకుంటారు ఫ్యాన్స్. అందుకే కొత్త సినిమా నుంచి ఏ చిన్న సాంగ్, టీజర్ చివరికి ట్రైలర్ వరకు సరికొత్త రికార్డులు సృష్టించి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇప్పుడు సర్కారు వారి పాట ట్రైలర్ రాకతో మళ్లీ లెక్కలు మారాయి. టాలీవుడ్ మోస్ట్ వ్యూయ్ డ్ ట్రైలర్ గా 24 గంటల్లో 2 కోట్ల 67 లక్షలకు పైగా వ్యూస్ సాధించి టాప్ 1 స్థానాన్ని చేరుకుంది సూపర్ స్టార్ సర్కారు వారి పాట.

Sarkaru Vaari Paata: కళావతి @ 150 మిలియన్

మహేశ్ బాబు మూవీ అప్ డేట్స్ అంటే రచ్చ చేయడం ఫ్యాన్స్ కి అలవాటు. రికార్డ్ కొట్టడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వాళ్లు వదలరు. సో లేటెస్ట్ గా సర్కారు వారి పాట ట్రైలర్ ను వ్యూస్ పరంగా హైయ్యెస్ట్ నంబర్ చూపించి టాప్ 1 పొజిషన్ లో నిలబెట్టారు. ఇక 24 గంటల్లో హైయ్యెస్ట్ లైక్స్ విషయంలో మాత్రం సూపర్ స్టార్ సినిమా సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 12 లక్షల 19 వేల లైక్స్ తో సర్కారు వారి పాట మోస్ట్ లైక్డ్ ట్రైలర్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉంటే కాస్త ఎక్కువ సాధించి 12లక్షల 40వేల లైక్స్ తో ట్రిపుల్ ఆర్ ఇప్పటికీ నంబర్ లైక్డ్ ట్రైలర్ గా హవా కొనసాగిస్తోంది.

Sarkaru Vaari Paata: ముచ్చటగా మూడోసారి.. హాలీవుడ్ సినిమాలతో మహేష్ మూవీ క్లాష్!

ఇక 24 గంటల్లో వ్యూస్ లెక్క ప్రకారం హైయ్యెస్ట్ రికార్డ్ కొట్టిన టాలీవుడ్ టాప్ సినిమాలు తీసుకుంటే సర్కారు వారి పాట తర్వాత 2 కోట్ల 32 లక్షలతో రాధేశ్యామ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆపై వరుసగా 2 కోట్ల 18 లక్షలతో ఆచార్య.. ఈ సినిమాకు కాస్త తక్కువగా బాహుబలి2 ఉన్నాయి. బాహుబలి2 తర్వాత ప్లేస్ లో 2 కోట్ల 4 లక్షల వ్యూస్ తో ట్రిపుల్ ఆర్ నిలిచింది. జక్కన్న సినిమా తర్వాత మోస్ట్ వ్యూయ్డ్ ట్రైలర్స్ లిస్ట్ లో పవన్ కల్యాణ్ వకీల్ సాబ్, అల్లు అర్జున్ పుష్ప సినిమాలు ఇప్పటికీ ట్రెండ్ కొనసాగిస్తున్నాయి.

KGF2: కేజీఎఫ్2.. ట్రైలర్‌తోనే రికార్డుల మోత!

చూడటం సంగతి పక్కన పెట్టి ఎక్కువమంది ఇష్టపడిన టాలీవుడ్ మూవీ ట్రైలర్స్ లిస్ట్ లో ట్రిపుల్ ఆర్, సర్కారు వారి పాట తర్వాత 11లక్షలకు పైగా లైక్స్ తో ఇంకా ఫామ్ లోనే ఉన్నాడుు భీమ్లా నాయక్. ఇంకో విశేషమేమిటంటే భీమ్లానాయక్ తర్వాతి ప్లేస్ లో కూడా పవన్ సినిమానే ఉంది. 10లక్షలకు పైగా లైక్స్ తో వకీల్ సాబ్ సత్తా చాటుతోంది. ఆపై వరుసగా పుష్ప, ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు టాలీవుడ్ మోస్ట్ లైక్డ్ ట్రైలర్స్ లిస్ట్ లో సత్తా చాటుతున్నాయి. అయితే కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా టాప్ లీగ్ లో ఇంకా పవర్ స్టార్ సినిమాలుండటం ఓ స్పెషాలిటీ.

Sarkaru Vaari Paata: పెన్నీ సాంగ్.. మహేష్ క్రేజ్‌కు మరో మచ్చుతునక!

ఓసారి పూర్తి సౌత్ లెక్కలు చూస్తే తమిళ్ సినిమానే నంబర్ వన్ పొజిషన్ లో జెండా ఎగిరేస్తోంది. అవును సౌత్ ఇండియన్ మోస్ట్ వ్యూయ్డ్ ట్రైలర్స్ జాబితాలో విజయ్ బీస్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 2 కోట్ల 90 లక్షల వ్యూస్ తో బీస్ట్ రికార్డ్ సెట్ చేసింది. విజయ్ మూవీ తర్వాతే సర్కారు వారి పాట, రాధేశ్యామ్, ఆచార్య, బాహుబలి2, ట్రిపుల్ ఆర్ సినిమాలున్నాయి. ఆ తర్వాత సౌత్ లిస్ట్ చివరి రెండు స్థానాల్లోనూ రాకింగ్ స్టార్ కేజీఎఫ్ 2 తెలుగు ట్రైలర్, కన్నడ ట్రైలర్ కనిపిస్తున్నాయి.

Upcoming Movies: ఒక్క టీజర్.. శాంపిల్‌తోనే సినిమా చూపించేస్తున్న మేకర్స్!

సౌత్ ఇండియన్ మోస్ట్ లైక్డ్ ట్రైలర్ లిస్ట్ ఓసారి చూద్దాం. ఇందులో కూడా 22లక్షలకు పైగా లైక్స్ తో కోలీవుడ్ మూవీ బీస్ట్ నంబర్ పొజిషన్ లో ఉంది. ఆ తర్వాతే అదే విజయ్ బిగిల్, అజిత్ వలిమై, ట్రిపుల్ ఆర్, సర్కారు వారి పాట, విశ్వాసం, భీమ్లానాయక్ సినిమా ట్రైలర్స్ ఉన్నాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అటు వ్యూస్, ఇటు లైక్స్ పరంగా బీస్ట్ ఇంకా సౌత్ నంబర్ వన్ గా కాలర్ ఎగిరేయడం దళపతి ఫ్యాన్స్ కు పండగే.

Sarkaru Vaari Paata: సెంచరీ కొట్టిన కళావతి.. మహేష్ స్టెప్స్‌కు జనం ఫిదా!

ఆల్ టైమ్ రికార్డ్ సాధించాలనే పట్టుదలతో మహేశ్ ఫ్యాన్స్ గట్టిగా ట్రై చేశారు. అనుకున్నది సాధించారు. 2 కోట్ల 70 లక్షల వ్యూస్ తో ట్రైలర్ ను ఫస్ట్ ప్లేస్ కి తీసుకొచ్చి.. లైక్స్ పరంగానూ 12లక్షలు సాధించారు. కానీ కాస్త స్మాల్ నంబర్ ఛేంజ్ తో లైక్స్ విషయంలో నంబర్ 2 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది సర్కారు వారి పాట. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు కూడా రికార్డ్స్ కొట్టినవే. ఇక మే 12న సినిమా రిలీజైతే కొత్త కలెక్షన్ లెక్కలు చూపించాలనేది సూపర్ స్టార్ ఫ్యాన్స్ వర్షన్. మరి ఏం జరుగబోతుందో చూడాలి.

×