RRR : ఆస్కార్‍కి ఎంపిక చేయనందుకు బాధపడ్డా.. రాజమౌళి!

గత కొన్ని రోజులుగా అమెరికాలోని పలు ఇంగ్లీష్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న RRR టీంకి ఆస్కార్‍ ఎంపిక విషయంలో రాజకీయం జరిగిందా అనే ప్రశ్న ఎదురవుతుందది. ఇటీవల ఎన్టీఆర్ దీనిపై స్పందించగా, తాజాగా రాజమౌళి కూడా పెదవి విప్పాడు.

RRR : ఆస్కార్‍కి ఎంపిక చేయనందుకు బాధపడ్డా.. రాజమౌళి!

rajamouli

RRR : ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియా ఫిలిం ఇండస్ట్రీ రేంజ్ అమాంతం పెంచేశాడు రాజమౌళి. బిఫోర్ ఇండిపెండెన్స్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా అనేక రికార్డులను సృష్టిస్తుంది. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నటించిన ఈ భారీ మల్టిస్టార్రర్ చిత్రం దేశం తరుపు నుంచి ఆస్కార్ కి ఎంపిక అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ భారతీయ ప్రభుత్వం గుజరాతీ ఫిలిం అయిన ‘ది లాస్ట్ ఫిలిం షో’ని ఎంపిక చేసింది. దీంతో ఎంపిక విషయంలో రాజకీయం జరిగింది అంటూ విమర్శలు ఎదురుకుంది.

NTR : ఆస్కార్‌కి ‘RRR’ని ఎంపిక చేయకపోవడంలో రాజకీయం.. ఎన్టీఆర్ సమాధానం!

ఇక ఈ విషయం గురించి పలు ఇంగ్లీష్ మీడియాలో ఇంటర్వ్యూకి పాల్గొంటున్న ఆర్ఆర్ఆర్ టీంని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ని.. ఎంపిక విషయంలో రాజకీయం జరిగిందా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ బదులిస్తూ.. సెలక్షన్ ప్యానల్ లో ఉన్న సభ్యులకి ఏ సినిమా ఎంపిక చేయాలనేది బాగా తెలుసు. కాబట్టి ఎంపికలో రాజకీయం జరిగిందా? లేదా? అనేది నేను మాట్లాడాను అని వెల్లడించాడు.

తాజాగా ఈ ప్రశ్నని రాజమౌళి కూడా ఎదురుకున్నాడు. రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో దేశం తరపు నుంచి ‘ది లాస్ట్ ఫిలిం షో’ స్థానం దక్కించుకున్నందుకు సంతోషమే. కానీ దేశం తరపు నుంచి ఆర్ఆర్ఆర్ ని ఎంపిక చేయకపోవడం బాధ కలిగించింది. అయితే బాధ పడుతూ అదే విషయం గురించి ఆలోచించే వ్యక్తులం మేము కాదు. ఈరోజు విదేశీలు కూడా RRR దేశం తరపు నుంచి అధికార ఎంట్రీ ఇస్తే బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు. ఆ విషయం చాలా సంతోషాన్ని అందిస్తుంది’ అంటూ వ్యాఖ్యానించాడు.

అలాగే ఎంపికలో రాజకీయం గురించి మాట్లాడుతూ.. ‘ఫిలిం ఫెడరేషన్ ఇండియా ఎలా ఉంటుంది. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేవి నాకు తెలియదు. కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు’ అంటూ ఎన్టీఆర్ లాగానే మాట దాటేశాడు. ప్రస్తుతం ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో నిలవగా, బెస్ట్ పిక్చర్ నామినేషన్స్ లో నిలిచేందుకు పోటీ పడుతుంది.