Samantha: ‘శాకుంతలం’కు శుభం కార్డు వేసిన సమంత!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం చేతి నిండా ఆఫర్లతో పూర్తి బిజీగా ఉంది. ఆమె కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది......

Samantha: ‘శాకుంతలం’కు శుభం కార్డు వేసిన సమంత!

Samantha Completes Dubbing For Shakunthalam

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం చేతి నిండా ఆఫర్లతో పూర్తి బిజీగా ఉంది. ఆమె కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది. ఇప్పటికే తమిళంలో ‘‘కాతు వాకుల రెండు కాదల్’’ అనే సినిమాను విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి పూర్తి చేసిన సామ్, ఈ సినిమాను రిలీజ్ కు రెడీ చేసింది. అయితే తెలుగులో ఆమె దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్ లో ‘శాకుంతలం’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Samantha: కండల కోసం సమంత కసరత్తు..

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తికాగా, ఈ చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. కాగా తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేసినట్లు సమంత తన ఇన్ స్టా పోస్ట్ లో తెలిపింది. ‘శాకుంతలం’ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తుండగా, శకుంతల పాత్రలో సమంత మరోసారి తనదైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతోంది.

Samantha : బాలీవుడ్‌‌కి మకాం.. ముంబైలో ఇల్లు కొంటున్న సమంత..

కాగా ఈ సినిమాను గుణ టీమ్‌వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తుండగా, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఇక శాకుంతలం చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉండగా, ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.

Samantha Completes Dubbing