Bigg Boss 5 : బిగ్ బాస్ లో చింపేసిన సిరి లేఖ ఇదే.. బయటకి రాగానే పెళ్లి చేసుకుందాం..

నామినేషన్స్ లో భాగంగా విశ్వ కోసం తన ప్రియుడు శ్రీహాన్‌ రాసిన లేఖను ముక్కలు చేయడానికి సిద్ధపడింది సిరి. విశ్వకు లేఖ అందించమని చెప్తూ ఎమోషనల్‌ అయింది. సిరి చేసిన త్యాగానికి

Bigg Boss 5 : బిగ్ బాస్ లో చింపేసిన సిరి లేఖ ఇదే.. బయటకి రాగానే పెళ్లి చేసుకుందాం..

Siri

Bigg Boss 5 :  బిగ్ బాస్ లో ప్రతి సారి నామినేషన్స్ టైంలో గొడవలు అవుతాయి. కానీ ఈ సారి ఎనిమిదోవారం నామినేషన్‌ ప్రక్రియ కాస్త ఎమోషనల్‌గా సాగింది. చాలా రోజుల నుంచి కుటుంబ సభ్యులకు దూరమైన కంటెస్టెంట్స్‌కి వారి నుంచి లేఖలు తెప్పించి వాటితోనే నామినేషన్‌ ప్రక్రియను పెట్టాడు బిగ్‌బాస్‌. దీంతో ఒకరి కోసం మరొకరు ఆ లేఖల్ని త్యాగం చేయాల్సి వచ్చింది. అలా త్యాగం చేసిన లేఖలు అక్కడే చింపేసారు. కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన లేఖలు కళ్ళ ముందు చిరిగిపోతుంటే కంటెస్టెంట్స్ ఏడుస్తూ ఉండిపోయారు.

RC15 : స్టార్ హీరోల్ని విలన్స్ గా మార్చిన రామ్ చరణ్.. భారీగా ప్లాన్ చేసిన శంకర్

నామినేషన్స్ లో భాగంగా విశ్వ కోసం తన ప్రియుడు శ్రీహాన్‌ రాసిన లేఖను ముక్కలు చేయడానికి సిద్ధపడింది సిరి. విశ్వకు లేఖ అందించమని చెప్తూ ఎమోషనల్‌ అయింది. సిరి చేసిన త్యాగానికి ప్రేక్షకులు కూడా కంటతడి పెట్టారు. తాజాగా శ్రీహాన్ నుంచి సిరికి వచ్చిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సిరి ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని మెయింటైన్ చేస్తున్న టీం ఈ లెటర్ ని పోస్ట్ చేసింది.

Balakrishna : మోహన్ బాబుతో మొదలు పెట్టనున్న బాలకృష్ణ

దీంట్లో శ్రీహాన్.. హాయ్‌ సిరి మన ఏడేళ్ల రిలేషన్‌లో ఇన్ని రోజులు దూరంగా ఉంటామని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు నా పక్కన లేకపోయినా మన లవ్‌ను ఫీల్‌ అవుతున్నాను. మా అమ్మ నాన్న తర్వాత నా గురించి ఎక్కువగా ఆలోచించేది ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. మనం బాగున్నప్పుడు అందరూ మనల్ని నమ్ముతారు. కానీ నా దగ్గర ఏమి లేనప్పుడు కూడా నువ్వు నన్ను నమ్మావు సిరి. నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నా. నువ్వు హ్యాపీగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నువ్వు బయటకు వచ్చాక మనం పెళ్లిచేసుకొని జీవితాంతం కలిసుందాం’ అంటూ లేఖలో రాశాడు. ఈ ప్రేమ లేఖని చూసి అభిమానులు, నెటిజన్లు వాళ్ళ ప్రేమని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.