Tollywood Stars: ఏడ్చి.. ఏడిపించేసి.. టాలీవుడ్ స్టార్స్ ఎమోషనల్ టచ్!

ఈమధ్య బాగా ఎమోషనల్ అయిపోతున్నారు టాలీవుడ్ స్టార్స్. కొవిడ్ తో మారిన లెక్కలో.. సినిమా మీద పెరిగిన ప్రేమో కానీ బాగా సెన్సిటివ్ అయ్యారు. ప్రీరిలీజ్ ఫంక్షన్స్ నుంచి సక్సెస్ మీట్..

Tollywood Stars: ఏడ్చి.. ఏడిపించేసి.. టాలీవుడ్ స్టార్స్ ఎమోషనల్ టచ్!

Tollywood Stars: ఈమధ్య బాగా ఎమోషనల్ అయిపోతున్నారు టాలీవుడ్ స్టార్స్. కొవిడ్ తో మారిన లెక్కలో.. సినిమా మీద పెరిగిన ప్రేమో కానీ బాగా సెన్సిటివ్ అయ్యారు. ప్రీరిలీజ్ ఫంక్షన్స్ నుంచి సక్సెస్ మీట్ ఫంక్షన్స్.. మధ్యమధ్యలో ప్రెస్ మీట్స్, ఫ్యాన్స్ మీట్ ఎక్కడో దగ్గర ఆనందబాష్పాలు పెట్టేసుకుంటున్నారు సినిమా స్టార్స్.

2021 Bollywood Films: బాలీవుడ్‌కి కలిసిరాని 2021.. వచ్చే ఏడాదిపైనే ఆశలన్నీ!

టాలీవుడ్ స్టార్స్ బాగా ఎమోషనల్ టచ్ ఇస్తున్నారు. ఇదేం పబ్లిసిటీ స్టంట్ కాదంటున్నారు. కొవిడ్… రిలేషన్ షిప్ వ్యాల్యూ పెంచిందో… మన స్టార్స్ లో ఎలాంటి మార్పు వచ్చిందో కానీ రియాలిటీ చూపిస్తున్నారు. ఉన్నది ఉన్నట్టు పలికేస్తున్నారు. నిజానికి ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసొస్తున్న సినిమా అంటే వార్ కి రెడీ అన్నట్టు ఉంటారు ఫ్యాన్స్. కానీ చరణ్, తారక్ ఇగోలకు పోకుండా ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తడం, బ్రదర్ బాండింగ్ తో ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేయడం జనాల్లో ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా నాలో సగభాగం చరణ్ అని ఎన్టీఆర్ అంటే… చనిపోయే వరకు తారక్ బ్రదర్ హుడ్ ని మనసులో పెట్టుకుంటా అని చరణ్ ఇచ్చిన స్పీచ్ ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లోనే హైలైట్ గా మారాయి.

NTR-Allu Arjun: బన్నీ వద్దనుకున్నా.. తారక్ కావాలనుకున్నాడు!

పుష్ప థ్యాంక్స్ మీట్… వాళ్లు ఏడ్చి… ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది పుష్ప టీమ్. తన భార్యకు థ్యాంక్స్ చెప్తూ భావోద్వేగానికి గురయిన సుకుమార్… చంద్రబోస్ కాళ్లు పట్టుకుని అభినందించారు. ఇక అల్లు అర్జున్ నాకు దేవుడు లాంటి వాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేసారు. సుకుమార్ మాట్లాడుతున్నప్పుడే ఫుల్ ఎమోషనల్ అయిన బన్నీ… తనవంతు రాగానే తాను ఏడ్చేసి… సుకుమార్ ని అక్కడనున్నవారిని… ప్రేక్షకులని గుండె బరువెక్కేలా చేసేసాడు. సుకుమార్ లేకపోతే నేను లేనంటూ ఐకాన్ స్టార్ ఇచ్చిన స్పీచ్ ఇద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ను బయటపెట్టింది.

Pushpa: తగ్గేదేలే.. హీటెక్కిస్తున్న పుష్పరాజ్ లెక్కలు!

ఆడియెన్స్ ను అవమానిస్తున్నారని శ్యామ్ సింగ రాయ్ ప్రమోషన్స్ లో నాని మాట్లాడిన తీరు పెద్ద వివాదమయింది. నాని మాటలను అర్థం చేసుకున్న వాళ్లకంటే… నెగెటివిటీని స్ప్రెడ్ చేసిన వాళ్లే ఎక్కువయ్యారని నాని ఫ్యాన్స్ అన్నారు. సేమ్ దిల్ రాజు కూడా నాని మాటల వెనకున్న ఎమోషన్ ను రివీల్ చేసారు. నాని ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో… అంత ఎమోషనల్ అవడానికి కారణాలెంటి అన్నదానిపై రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు.

RRR: న్యూ ఇయర్ సందడి.. టెలికాస్ట్ కానున్న హిందీ ప్రమోషన్లు!

ఇదే శ్యామ్ సింగ రాయ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సాయి పల్లవి కంటతడి పెట్టుకుంది. ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానాన్ని తలచుకుని ఎమోషనలయిందీ న్యాచురల్ బ్యూటీ. తనను నమ్మి అవకాశాలిచ్చిన డైరెక్టర్స్ కి, తనపై ఇంత ప్రేమను చూపిస్తున్న ఫ్యాన్స్ కి థాంక్స్ చెబుతూ సాయి పల్లవి కూడా ఆనంద భాష్పాలు పెట్టేసుకుంది.

RRR: నెవెర్ బిఫోర్ అనేలా తారక్-చరణ్.. ఓ తప్పస్సులా ప్రమోషన్లు!

విడాకుల తర్వాత కాస్తంత సపోర్ట్ దొరికినా ఎమోషనల్ అవుతుంది సమంతా. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా… సమంతా గురించి చెప్పమన్నప్పుడు కమ్ బ్యాక్, బిగ్గర్, స్ట్రాంగర్ అన్నారు రామ్ చరణ్. ఆ వీడియోకు ఎమోజీస్ యాడ్ చేసి పోస్ట్ చేసింది సామ్. అలాగే పుష్ప థాంక్స్ మీట్ లో తన మీద నమ్మకం పెట్టుకున్నందుకు సమంతకు థాంక్స్ చెప్పారు బన్నీ. ఇక ఆ వీడియోను కూడా పోస్ట్ చేసిన సామ్… నేను ఇకపై ఎప్పటికీ నిన్ను నమ్ముతానంటూ ఎమోషనల్ టచ్ ఇచ్చింది.

RRR: చరణ్, ఎన్టీఆర్ గురించి చెబుతూ.. ఒక్కసారిగా ఎమోషనల్ అయిన రాజమౌళి!

టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్స్ కూడా ఏడ్చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన 83 మూవీ విషయంలో రణ్ వీర్, దీపికా… భార్యాభర్తలిద్దరూ సెంటిమెంట్ చూపించారు. బుర్జ్ ఖలిపాపై 83 ట్రైలర్ ప్లే చేసినప్పుడు దీపికా కన్నీళ్లు రాల్చేసింది. ఇక 83 థియేటర్స్ కొచ్చాక… ఓ నటుడిగా తనకు లభిస్తున్న అప్రిషియేషన్ చూసి రణ్ వీర్ గుక్కపట్టి ఏడ్చేసాడు. చాలా సేపటి వరకు రణ్ వీర్ అలా ఏడుస్తూనే ఉన్నాడు.