Telugu Star Heroes: అసలే సమ్మర్.. వెకేషన్ మూడ్‌లో తెలుగు హీరోలు!

కోవిడ్ తో లేటయిన సినిమాల్ని అసలు రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ చేసిన స్టార్ హీరోలు.. ఇప్పుడు చిల్ అవుతున్నారు. ఎప్పుడూ షూటింగ్ తో బిజీగా సెట్లోనే ఉండే హీరోలు..

Telugu Star Heroes: అసలే సమ్మర్.. వెకేషన్ మూడ్‌లో తెలుగు హీరోలు!

Telugu Star Heroes

Telugu Star Heroes: కోవిడ్ తో లేటయిన సినిమాల్ని అసలు రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ చేసిన స్టార్ హీరోలు.. ఇప్పుడు చిల్ అవుతున్నారు. ఎప్పుడూ షూటింగ్ తో బిజీగా సెట్లోనే ఉండే హీరోలు.. ఫారెన్ చెక్కేసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్ నుంచి బన్నీ వరకూ హాలీడే మూడ్ లోఉన్న హీరోలెవరో, షూట్ బ్రేక్ తీసుకను్న స్టార్లెవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

Telugu Star Heroes: పాన్ ఇండియా రేంజ్.. బాలీవుడ్‌లో టాలీవుడ్ హీరోల క్రేజ్

ఎప్పుడూ షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉండే స్టార్ హీరోలు.. ఈ సారి చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఇప్పటికే షూటింగ్స్ లేట్ అవ్వడంతో లాంగ్ షెడ్యూల్స్ చేసి మరీ సినిమాల్ని కంప్లీట్ చేశారు. ఇక వైపు రిలీజ్ హడావిడి, ప్రమోషన్లతో మొన్నటి వరకూ ఫుల్ బిజీగాఉన్న స్టార్ హీరోలు చిల్ బ్రో అంటూ హాలీడే మూడ్ లోకి వెళ్లిపోయారు. వరస పెట్టి వందల ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో లాస్ట్ వీక్ వరకూ ట్రిపుల్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నారు. నాలుగేళ్లుగా నాన్ స్టాప్ గా ట్రిపుల్ఆర్ కే డెడికేట్ అయ్యి ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు కంప్లీట్ గా రిలాక్స్ అయ్యి వెకేషన్ మూడ్ లోకి వెళ్లిపోయారు.

Bollywood Stars: హిట్ టైమ్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న బాలీవుడ్ బడా స్టార్స్!

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా వెకేషన్ లోనే ఉన్నారు. మొన్న మొన్నటి వరకూ సలార్, ప్రాజెక్ట్ కె షూట్స్ లో బిజీగా ఉంటూ రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో ఫుల్ ఎంగేజ్ అయిపోయిన ప్రభాస్.. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నారు. నాన్ స్టాప్ గా సినిమాలతో అలసిపోయిన ప్రభాస్.. వెకేషన్ కి ఫారెన్ వెళ్ళారు. అంతేకాదు.. అక్కడే ఇంకొన్నాళ్లు టైమ్ కూడా స్పెండ్ చెయ్యబోతున్నారు.

Star Heroes Movies: కాలం చెల్లిన రొటీన్ సినిమా.. అష్టకష్టాలు పడుతున్న హీరోలు

పాత సినిమాల్ని యుద్ద ప్రాతిపదికన బ్యాక్ టూ బ్యాక్ షూట్స్ చేసి మరీ కంప్లీట్ చేస్తున్నారు మన స్టార్లు. మొన్నీమధ్యనే సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ చేసిన మహేష్ బాబు ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. జనరల్ గా సినిమా మధ్యలోనే బ్రేక్ తీసుకుని ఫారెన్ వెళ్లొచ్చే మహేష్.. సర్కారు వారి పాట కంప్లీట్ అవ్వడంతో.. ఇప్పుడు లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ వెకేషన్ ప్లాన్ చేసుకున్న మహేష్.. ఈనెలలోనే ఫారెన్ ట్రిప్ కి వెళ్లబోతున్నారు.

Telugu Stars: ప్రజల కోసం సివిల్ సర్వెంట్స్.. రూటు మార్చిన మాస్ హీరోలు!

ఎప్పుడూ షూట్స్ తో బిజీగా ఉంటే హీరోలకు కాస్త టైమ్ దొరికిందంటే ఫుల్ టైమ్ ప్యామిలీ కే స్పెండ్ చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అంతే.. ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయారు. ఇక సమ్మర్ కూడా స్టార్ట్ అవ్వడంతో ఇప్పుడే షూటింగ్ వద్దని బ్రేక్ తీసుకుని పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు బన్నీ. హెక్టిక్ షెడ్యూల్ తో పుష్ప కంప్లీట్ చేసి.. రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. మూడునెలల నుంచి రిలాక్స్ మోడ్ లోనే ఉన్నారు. ఫారెన్ వెకేషన్ కి ఆల్రెడీ వెళ్లొచ్చిన బన్నీ.. మరోసారి ఫ్యామిలీతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు.