Unstoppable Aha: ఇది వేరే లెవెల్.. బాలయ్య షోలో జక్కన్న-కీరవాణి!

తెలుగు ప్రేక్షకులకు వంద శాతం వినోదాన్ని అందిస్తామని ప్రామిస్ చేసిన తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది.

Unstoppable Aha: ఇది వేరే లెవెల్.. బాలయ్య షోలో జక్కన్న-కీరవాణి!

Unstoppable Aha

Unstoppable Aha: తెలుగు ప్రేక్షకులకు వంద శాతం వినోదాన్ని అందిస్తామని ప్రామిస్ చేసిన తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. బ్లాక్‌బస్టర్ సినిమాలు, పాపులర్ షోలు, ఆకట్టకునే వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక, నటసింహం నందమూరి బాలకృష్ణ ‘Unstoppable with NBK’ టాక్ షో అయితే నెవెర్ బిఫోర్ అనేలా సాగిపోతుంది. ఈ షోతో బాలకృష్ణ కెరీర్లో ఇంతకు ముందెన్నడూ చూడని కోణాన్ని చూస్తున్నారు ప్రేక్షకులు.

Rajinikanth: ప్లాప్ దర్శకుడితో సూపర్ స్టార్.. అంత నమ్మకం ఏంటి ‘పెద్దన్నా’?

ఇప్పటి వరకు ఈ షోలో వచ్చిన ఎపిసోడ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్ కొట్టగా వచ్చే ఎపిసోడ్స్ అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నారు షో యాజమాన్యం. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ తో చేసిన బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ ఒకటి ప్రసారమయ్యేందుకు సిద్ధంగా ఉండగా ఇప్పుడు మరో నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి సొంతం. బాలయ్య ఇప్పుడు ఆ రాజమౌళితో పాటు సంగీత సంచలనం కీరవాణిలతో స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాడట.

Rashmika Mandanna : షార్ట్ నిక్కర్‌లో ‘సామి.. సామి..’ అంటున్న రష్మిక.. ఇది కూడా ప్రమోషన్స్‌లో భాగమే..

రాజమౌళి, కీరవాణిలతో బాలయ్య స్మాల్ స్క్రీన్ షేరింగ్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కాగా దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ గురించి బాలయ్య ఈ షోలో ఏం ప్రశ్నలు సంధించనున్నాడు.. తారక్, చరణ్ నటనలపై జక్కన్న ఎలాంటి కామెంట్స్ చేయనున్నాడన్నది ఆసక్తిగా మారగా.. ఈ డిసెంబర్ 17నే ఈ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ చేయనున్నారట. ఇప్పటికే విడుదలైన ప్రోమోలో బాలయ్య-రాజమౌళి సంభాషణలు సరదాగా సాగగా.. ఎపిసోడ్ లో బాలయ్య-రాజమౌళి మధ్య సంభాషణ ఎలా ఉండనుందో చూడాలి.