Tollywood : జగన్ తో మీటింగ్ కి పోసాని, అలీ ఎందుకు వెళ్లారు??

నిన్నటి మీటింగ్ కి వీరంతా కలిసే వెళ్లారు. వీరిని చిరంజీవే పిలిచారు అని సమాచారం. కానీ వీరితో పాటు అక్కడ మీటింగ్ కి పోసాని కృష్ణ మురళి, అలీ, ఆర్ నారాయణ మూర్తి కూడా వచ్చారు...........

Tollywood : జగన్ తో మీటింగ్ కి పోసాని, అలీ ఎందుకు వెళ్లారు??

Tollywood Meeting

Tollywood :  సినీ పరిశ్రమ కష్టాలు, సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు గత కొన్ని నెలలుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ముందుండి వీటన్నిటికీ పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీటిపై ఏపీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ ని, మంత్రి పేర్ని నానితో కలిసి సమస్యలని వివరించారు. తాజాగా నిన్న మరోసారి చిరంజీవి తనతో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి లను తీసుకువెళ్లి జగన్ తో మాట్లాడారు.

అయితే నిన్నటి మీటింగ్ కి వీరంతా కలిసే వెళ్లారు. వీరిని చిరంజీవే పిలిచారు అని సమాచారం. కానీ వీరితో పాటు అక్కడ మీటింగ్ కి పోసాని కృష్ణ మురళి, అలీ, ఆర్ నారాయణ మూర్తి కూడా వచ్చారు. దీంతో ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రజల్లో ఇప్పుడు కొత్త ప్రశ్న తలెత్తుతుంది. వీరిని ఎవరు పిలిచారు. ఒకవేళ పిలిచినా వీరికంటే పెద్ద ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు కదా అని అనుకుంటున్నారు.

అయితే ఆర్ నారాయణ మూర్తి గురించి అందరికి తెలిసిందే. ఆయన పేదల పక్షాన పోరాడతారని. సినీ పరిశ్రమలో కింది స్థాయి వ్యక్తుల వద్దకు కూడా నారాయణ మూర్తి వెళ్లి పరామర్శిస్తారు. ఆర్ నారాయణ మూర్తి అంటే ఇండస్ట్రీలో అందరికి గౌరవం ఉంది. చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్స్ సైతం ఆర్ నారాయణ మూర్తిని గౌరవిస్తారు. అందుకే ఇటీవల ‘బంగార్రాజు’ సినిమా సక్సెస్ మీట్ కి కూడా నాగార్జున నారాయణమూర్తిని పిలిచారు. ఇప్పుడు మీటింగ్ కి కూడా ఆర్ నారాయణ మూర్తిని చిరంజీవే పిలిచారని సమాచారం. ఆయన వస్తే సినీ పరిశ్రమలో కింద స్థాయి వ్యక్తుల కష్టాలు ఇంకా బాగా చెప్పగలరని ఆయన్ను పిలిచినట్టు సమాచారం. దీంతో నారాయణ మూర్తి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం తర్వాత మీడియా ముందు చిరు, నారాయణ మూర్తి సరదాగా మాట్లాడుకున్నారు కూడా.

Shaktimaan : శక్తిమాన్ మళ్ళీ వస్తున్నాడు..

అయితే ఈ సమావేశానికి పోసాని, అలీ ఏ హోదాలో హాజరయ్యారని అంతా ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరూ వైఎస్సార్సీపీ పార్టీ సభ్యులు. వీరే కాకుండా సినీ పరిశ్రమ నుంచి మరికొంతమంది ప్రముఖులు కూడా వైఎస్సార్సీపీ పార్టీలో ఉన్నారు. అయితే వైఎస్సార్సీపీ పార్టీలో కూడా సినీ పరిశ్రమకి సంబంధించిన ప్రముఖులు, సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్ ఉన్నారు. దీంతో వీరి వైపు నుంచి కూడా మాట్లాడటానికి అలీ, పోసాని కృష్ణ మురళిని ఏపీ ప్రభుత్వమే పిలిచింది అని సమాచారం. వైఎస్సార్సీపీ సినీ ప్రతినిధులుగా మాట్లాడటానికి పార్టీ పెద్దలు వీరిద్దర్నీ పంపించినట్లు తెలుస్తుంది.

Dimple Hayathi : ఒక్కపాట కోసం ఆరు కిలోల బరువు తగ్గిన హీరోయిన్

అయితే గతంలో పవన్ – పోసాని రచ్చ తర్వాత పోసాని మా ఎలక్షన్స్ టైములో బయట కనపడ్డాడు. మళ్ళీ ఇప్పుడు కనిపించారు. నిన్న మీటింగ్ తర్వాత కూడా ఆలీ ఉన్నా పోసాని మాత్రం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మొత్తానికి నిన్నటి మీటింగ్ ఎలా జరిగినా, ఎవరు వచ్చినా అందరికి మంచే జరుగుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.