Bollywood Film Releases: వారానికో సినిమా.. కాస్కో అంటోంది బాలీవుడ్!

ఎప్పుడైతే థియేటర్స్ తెరుచుకుంటాయని ప్రకటించారో...ఆలస్యం చేయకుండా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసారు బాలీవుడ్ మేకర్స్. అదీ ఓ పద్ధతిలో. నువ్వు నాకు పోటీ వద్దు...నేను నీ మార్కెట్ పై..

Bollywood Film Releases: వారానికో సినిమా.. కాస్కో అంటోంది బాలీవుడ్!

Bollywood Film Releases

Bollywood Film Releases: ఎప్పుడైతే థియేటర్స్ తెరుచుకుంటాయని ప్రకటించారో…ఆలస్యం చేయకుండా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసారు బాలీవుడ్ మేకర్స్. అదీ ఓ పద్ధతిలో. నువ్వు నాకు పోటీ వద్దు…నేను నీ మార్కెట్ పై కొట్టనంటూ సెంటిమెంట్ లెక్కలు వేసుకున్నారు. ఆ ప్రకారమే ముందు సూర్యవంశీ థియేటర్స్ లో దిగి… 100కోట్ల మార్క్ దాటేసింది. ఇక వారానికో సినిమా ప్రకారం నయా ట్రెండ్ సెట్ చేసుకుని ఇక కాస్కో అంటోంది బాలీవుడ్. వరసగా సినిమా రిలీజ్ లు అనౌన్స్ చేసిన హిందీ మేకర్స్.. బరిలోకి ఒక్కొక్కరుగా దిగుతున్నారు.

Krithi Shetty: లిప్‌లాక్ ఒకే.. బేబమ్మ హద్దులు చెరిపేసిందా?

టాలీవుడ్ మాత్రమేనా మేమూ మా సంగతేంటో చూపిస్తాం అన్నట్టుంది బాలీవుడ్ మేకర్స్ హడావిడీ. అందుకే టాలీవుడ్ పాన్ ఇండియా టార్గెట్ పై సవాల్ విసురుతూ ఏకంగా 2023 వరకు రిలీజ్ డేట్స్ వదిలారు. అయితే వాళ్లలో వాళ్లకు ఎక్కువ పోటీ రాకుండా డేట్స్ అయితే అనౌన్స్ చేసారు కానీ దేశవ్యాప్తంగా సినిమాల జాతరలో హిందీ సినిమాలు ఎంతవరకు నిలుస్తాయన్నది ప్రశ్నార్ధకంగానే మారింది. ముఖ్యంగా తెలుగులో ఇక్కడ బాక్సాఫీస్ ను కొల్లగొట్టాలంటే టాలీవుడ్ స్టార్స్ తో పోటీ తప్పదు.

Heroin’s Social Media: సీనియర్ హీరోయిన్స్‌ను బీట్ చేస్తున్న యంగ్ బ్యూటీస్!

అక్షయ్ సూర్యవంశీ ఇచ్చిన బూస్టప్ తో రికార్డులు ఖాయం అంటూ సైఫ్, రాణీముఖర్డీ, సిద్ధార్ధ్ చతుర్వేది, శర్వారీ నటించిన బంటీ ఔర్ బబ్లీ 2 నవంబర్ 19న రాబోతుంది. తర్వాత వారానికి నవంబర్ 25న సత్యమేవ జయతే 2 రిలీజ్ ఉంది. దివ్య కోశ్లా కుమార్ లేడీ లీడ్ కనిపించబోతున్న ఈ మూవీలో జాన్ అబ్రహం ట్రిపుల్ రోల్ చేసాడు. నవంబర్ 26న సల్మాన్ ఖాన్ తన బావ ఆయుష్ శర్మతో స్క్రీన్ షేర్ చేసుకున్న అంతిమ్ రాబోతుంది. ఆర్ ఎక్స్ 100 రీమేక్ గా తెరకెక్కిన తడప్ డిసెంబర్ 3న సినిమా హాళ్లకు వచ్చేస్తోంది. అహాన్ శెట్టి, తారా సుతారియా రొమాన్స్ పండించారిందులో.

Telugu Star Hero’s: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న తెలుగు హీరోలు!

ఆయష్మాన్ ఖురానా, వాణీకపూర్ జంటగా అభిషేక్ డైరెక్షన్లో తెరకెక్కిన చండీఘర్ కరే ఆషికీ డిసెంబర్ 10న స్లాట్ బుక్ చేసుకుంది. తెలుగుతో పాటూ సౌత్ లాంగ్వెజెస్ ప్లస్ హిందీలో కూడా ముస్తాబవుతోన్న పుష్ప పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. డిసెంబర్ 17న వస్తున్నామంటూ నార్త్ లో కూడా ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసారు మేకర్స్. అందుకే బాలీవుడ్ రిలీజెస్ లిస్ట్ లో చేరింది బన్నీ పుష్ప. బాలీవుడ్ మోస్ట్ అవైటైడ్ మూవీ 83 క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి రెడీఅయింది. లీడ్ రోల్ కపిల్ దేవ్ పాత్రలో రణ్ వీర్ సింగ్ నటిస్తుండగా.. ఆయన వైఫ్ రోమీ భాటియాగా దీపికా పదుకొణే కనిపించనుంది. సేమ్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ తోనే నాని జెర్సీ మూవీ రీమేక్ గా డిసెంబర్ 31న రాబోతుంది షాహిద్ జెర్సీ.

Rashi Khanna: కరణ్ జోహార్ బ్యానర్‌లో రాశీ.. బంపర్ అఫర్ కొట్టేసినట్లే

సౌత్ టు నార్త్ మూవీ లవర్స్ వెయిట్ చేస్తోన్న సినిమా ట్రిపుల్ ఆర్ జనవరి 7న వస్తోంటే… సంక్రాంతికి పాన్ ఇండియా మూవీగా బాలీవుడ్ లోనూ జనవరి 14న తన రాధేశ్యామ్ ను తీసుకొస్తున్నారు ప్రభాస్. ఇక జనవరి 21న అక్షయ్ కుమార్ పీరియాడికల్ ఫిల్మ్ పృధ్వీరాజ్ రంగంలోకి కత్తులు విసరనుంది. జనవరి 26 రిపబ్లిక్ డే స్పెషల్ గా అటాక్ మూవీతో హాళ్లను అటాక్ చేయబోతున్నాడు జాన్ అబ్రహం. జాన్ వచ్చిన వారానికి ఫిబ్రవరి 4న రాజ్ కుమార్ రావ్, భూమి పడ్నేకర్ నటించిన బడాయి దో నవ్వించేందుకు సిద్ధమైంది.

Pushpa: బాలీవుడ్ మీద పుష్పరాజ్ స్పెషల్ ఫోకస్..!

ఫిబ్రవరి 11న మన హీరో అడవి శేష్ మేజర్ హిందీలోనూ రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ ఆడియన్స్ ఎదురుచూస్తున్న గంగూభాయ్ కతియావాడి 2022 ఫిబ్రవరి 18న థియేటర్స్ బుక్ చేసుకుంది. అలియా ఎంట్రీ తర్వాత వన్ వీక్ గ్యాప్ లో ఫిబ్రవరి 25న రణ్ వీర్ సింగ్ జయేష్ బాయ్ జోర్దార్ గా కామెడీ చేయబోతున్నాడు. మార్చి 4న అక్షయ్ కుమార్, కృతీసనన్ జంటగా నటించిన బచ్చన్ పాండే థియేటర్స్ లో దిగనుంది. అర్షద్ వార్సీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా మేజర్ క్యారెక్టర్స్ చేసారు బచ్చన్ పాండేలో. రణ్ బీర్ కపూర్, వాణీకపూర్, సంజయ్ దత్ కలిసి నటిస్తోన్న షంషేరా మూవీ మార్చి 18న బాలీవుడ్ లో హల్చల్ చేయబోతుంది. అక్షయ్ కుమార్ మూవీని రీమేక్ చేస్తూ ట్రోలింగ్ కు గురైన కార్తీక్ ఆర్యన్… భూల్ భులయ్యా 2ను మార్చి 25న తీసుకురాబోతున్నాడు.

Bandla Ganesh: మీరు సూపర్‌ సార్‌.. చిరును తెగ పొగిడేసిన బండ్ల!

2022 ఏప్రిల్ 1న తన రాకేట్రీని తీసుకొస్తున్నాడు మాధవన్. సిమ్రన్ మరో పాత్ర చేసిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 8న ధక్కడ్ తో రాబోతుంది కంగనా రనౌత్. నేషనల్ వైడ్ ఆడియెన్స్ వెయిట్ చేస్తోన్న రాఖీబాయ్ కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న థియేటర్స్ కోసం ఖర్చీఫ్ వేసింది. ఏప్రిల్ 14న వరుణ్ ధావన్ బేడియా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 29న అజయ్ దేవగణ్, అమితాబ్, రకుల్ కాంబో మూవీ మేడేను థియేటర్స్ లో చూపించబోతున్నారు. హీరోపంటి కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న టైగర్ ష్రాఫ్ హీరోపంటి2 కూడా ఏప్రిల్ 29కే ఫిక్సయింది. బోనీకపూర్ బ్యానర్ లో అజయ్ దేవగణ్, ప్రియమణి నటించిన మైదాన్ జూన్ 3న సౌత్ టు నార్త్ విడుదలకు సిద్ధమైంది. జూన్ 10న విక్కీ కౌశల్, కియారా, భూమి పడ్నేకర్ నటించిన రొమాంటిక్ కామెడీ గోవిందా నామ్ మేరా రిలీజ్ కానుంది.

Preity Zinta: 46 ఏళ్లకు కవలలకు తల్లైన సొట్టబుగ్గల సుందరి!

జూన్ 17న ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్ డాక్టర్ జీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, తారా సుతారియా, దిశా పఠానీ వంటి స్టార్ యాక్టర్స్ రెడీ అవుతోన్న సినిమా ఏక్ విలన్ రిటర్న్. ఈ మూవీ 2022 జూలై 8న సినిమా హాళ్లలో రచ్చచేయబోతుంది. అన్నింటికి మించి అన్నట్టు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్… ఆదిపురుష్ గా ..ఆగస్ట్ 11న వస్తారంటూ ప్రకటించారు మేకర్స్. అదే రోజు ప్రభాస్ కు పోటీగా రంగంలోకి దిగుతున్నాడు అక్షయ్ కుమార్. ఆగస్ట్ 11వ తేదీనే ఆదిపురుష్ తో పాటూ అక్షయ్ రక్షాబంధన్ సిల్వర్ స్క్రీన్స్ ని టచ్ చేయనుంది. ఈమధ్యే సెట్స్ పైకెళ్లిన విక్రమ్ వేదా రీమేక్ కూడా డేట్ ను అప్పుడే బుక్ చేసుకుంది. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ఆపోజిట్ రోల్స్ లో నటిస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 30న థియేటర్స్ ని స్టీల్ చేయబోతుంది.

Kollywood Hero’s: పెరిగిన బెందిరింపులు.. పాపం కోలీవుడ్ హీరోలు!

అక్టోబర్ లో రణ్ బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబో యానిమల్ విడుదలయ్యే అవకాశముంది. థ్రిల్లింగ్ సబ్జెక్ట్ తో రూపొందుతున్న రామ్ సేతుతో అక్షయ్ కుమార్ వచ్చే ఏడాది దీపావళి అంటే 2022 అక్టోబర్ 24కు ఇప్పుడే ఖర్చీఫ్ వేసేసాడు. అదే ఇయర్ నవంబర్ 24న కార్తీక్ ఆర్యన్ షెహ్ జాదా.. డిసెంబర్ 23న టైగర్ ష్రాఫ్, కృతీసనన్ గణపత్ పార్ట్1 సినిమాహాళ్లకి వస్తాయని ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పటివరకు అనౌన్స్ చేసిన డేట్ లో మరీ అడ్వాన్స్ గా ఉంది ఫైటర్ మూవీ. హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ నటిస్తోన్న ఫైటర్ 2023 జనవరి 26 రిపబ్లిక్ డే రోజుకు ఇప్పటినుంచే ముస్తాబవుతోంది.