తెగ వెతికేస్తున్నారు..Google..తల్లి…చెప్పవా మందు ఎలా తయారు చేసుకోవాలి

Google తల్లి..మందు ఎలా తయారు చేసుకోవాలో చెప్పవా..ప్లీజ్. నీ రుణం తీర్చుకోలేము. మళ్లా అడగగం. ఒకేఒక్కసారి చెప్పేయ్. ఇక ఇతరుల సంగతి చూసుకుంటాం..అంటున్నారు. అవును..పాపం లిక్కర్ దొరకక మ

తెగ వెతికేస్తున్నారు..Google..తల్లి…చెప్పవా మందు ఎలా తయారు చేసుకోవాలి

Google తల్లి..మందు ఎలా తయారు చేసుకోవాలో చెప్పవా..ప్లీజ్. నీ రుణం తీర్చుకోలేము. మళ్లా అడగగం. ఒకేఒక్కసారి చెప్పేయ్. ఇక ఇతరుల సంగతి చూసుకుంటాం..అంటున్నారు. అవును..పాపం లిక్కర్ దొరకక మందుబాబుల పడుతున్న కష్టాలు అంతాఇంతా కాదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దిక్కుమాలిన కరోనా..తొందరగా వెళ్లిపో అంటున్నారు. వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో…నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. మద్యం షాపులు, బార్లు, కళ్లు దుకాణాల బంద్ అయ్యాయి. దీంతో చాలా మంది Google తల్లిని ఆశ్రయిస్తున్నారు.

గూగూల్..ఎంతో మందికి దారి చూపుతుంది. తమకు తెలియని విషయాలను క్షణాల్లో కంప్యూటర్ తెరపై చూపిస్తుంది. దీంతో అందరూ దీనిని గూగుల్ తల్లి అంటుంటారు. ఎన్న సేవలను అందిస్తోంది. కొత్త కొత్త సేవ‌లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా కరోన వైరస్ కారణంగా మందు ఎలా తయారు చేసుకోవాలనే దానిపై చాలా మంది నెటిజన్లు వెతుకుతున్నారని గణంకాలు చెబుతున్నాయి. గూగుల్ కు ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నారు. నెల రోజుల్లో గూగుల్ సెర్చ్ చేసిన అంశాల్లో మద్యానికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి.

2020, మార్చి 22 నుంచి మార్చి 28వ తేదీ వరకు…ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు మద్యం సంబంధిత అంశాలపై సెర్చింగ్ పీక్ లెవల్ (Top Trending) లో ఉన్నట్లు తేలింది. మద్యానికి సంబంధంచిన అన్నీ అంశాలను కేంద్రపాలిత ప్రాంతాలైన గోవా, పాండిచ్చేరి, డయ్యూ అండ్ డామన్, కర్నాటక, ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, సిక్కిం, చండీగడ్, తెలంగాణ రాష్ట్ర వరస స్థానాల్లో నిలిచాయి.

కానీ ఏపీ మాత్రం 15వ స్థానంలో నిలిచింది. ఇక మద్యం తయారీ అనే అంశాన్ని సెర్చ్ చేస్తున్న రాష్ట్రాల్లో మణిపూర్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, అసోం, ఏపీ వరుస ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి. తెలంగాణ పదో స్థానంలో నిలిచింది. బీరు ఎలా తయారు చేసుకోవాలి అనే దానిపై కూడా గూగులో తెగవెతుకుతున్నారు. ఢిల్లీ, కేరళ, హర్యాణ, కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఏపీ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ మొదటి 10 స్థానాల్లో నిలిచాయి.

దీనితో పాటు..ఇతర అంశాలపైనా కూడా తెగ వెతుకుతున్నారు. కరోనా వైరస్, కరోనా వైరస్ టిప్స్, లాక్ డౌన్, కోవిడ్ 19, పీపీఈ కిట్స్, లాక్ డౌన్ కొనసాగింపు, హాట్ స్పాట్, ఎంహెచ్ ఏ గైడ్ లైన్స్, ఆరోగ్య సేతు, కరోనా వైరస్ ప్రివెన్సన్, లెటెస్ట్ కరోనా వైరస్ న్యూస్.