Covid Patients Suicide : తీవ్ర విషాదం.. కరోనా బారిన పడ్డ వృద్ధులు ఆత్మహత్య

క‌రోనా బారినప‌డి ఆస్ప‌త్రి పాలైన వృద్ధులను కుటుంబ‌స‌భ్యులు ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తున్న ఘ‌ట‌న‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా వ‌చ్చిందంటే చాలు వృద్ధులు వ‌ణికిపోతున్నారు. భ‌విష్య‌త్తును త‌లుచుకుని భ‌యంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలకు పాల్ప‌డుతున్నారు.

Covid Patients Suicide : తీవ్ర విషాదం.. కరోనా బారిన పడ్డ వృద్ధులు ఆత్మహత్య

Man Commits Suicide

2 Elderly Covid Patients Die By Suicide In Nagpur: దేశంలో క‌రోనావైరస్ మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంది. రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. చిన్న, పెద్ద..ధనిక, పేద.. అనే తేడా లేదు.. అందరిని కరోనా మహమ్మారి వణికిస్తోంది. కాగా, కోవిడ్ బారిన పడ్డ వృద్ధుల ప‌రిస్థితి మరీ దయనీయంగా మారింది. క‌రోనా బారినప‌డి ఆస్ప‌త్రి పాలైన వృద్ధులను కుటుంబ‌స‌భ్యులు ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తున్న ఘ‌ట‌న‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా వ‌చ్చిందంటే చాలు వృద్ధులు వ‌ణికిపోతున్నారు. భ‌విష్య‌త్తును త‌లుచుకుని భ‌యంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలకు పాల్ప‌డుతున్నారు.

తాజాగా మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో అలాంటి విషాదాలే చోటుచేసుకున్నాయి. 12 గంటల వ్యవధిలో కరోనా బారిన పడ్డ ఇద్దరు వృద్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. కోవిడ్ పాజిటివ్ రావ‌డంతో 81 ఏళ్ల వృద్ధుడు పురుషోత్తమ్ నాగ్‌పూర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలోని కొవిడ్ వార్డులో చేరి చికిత్స పొందుతున్నాడు. ఆ వృద్ధుడు సడెన్ గా సూసైడ్ చేసుకున్నాడు. బాత్రూమ్ లోకి వెళ్లి ఆక్సిజ‌న్ పైప్‌తో ఉరేసుకున్నాడు. మృతుడు మార్చి 26న గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ లో చేరాడు. బాత్రూమ్ లోకి వెళ్లిన వృద్ధుడు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. బాత్రూమ్ డోర్లు బద్దలుకొట్టారు. అప్పటికే వృద్ధుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు.

ఇది జరిగిన 12 గంటల వ్యవధిలోనే మరో విషాదం వెలుగుచూసింది. కరోనా బారిన పడ్డ మరో వృద్ధుడు(64ఏళ్లు) ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం(మార్చి 30,2021) ఉదయం 6.30గంటలకు ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కోవిడ్ మెడిసిన్ తీసుకున్న తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఆ తర్వాత ఇది జరిగిందని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, ఆ ఇంట్లో వృద్ధుడితో పాటు మరో ముగ్గురు కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు. మృతుడు కిడ్నీలో రాళ్ల సమస్యతో కూడా బాధపడుతున్నాడు.

దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్ లో ఉంది. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో అధిక శాతం ఆ రాష్ట్రం నుంచే ఉంటున్నాయి. రాష్ట్రంలో రోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. నాగ్ పూర్ లో గడిచిన 24 గంటల్లో 3వేల 177 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 38వేల 298 యాక్టివ్ కేసులు ఉన్నాయి.