Corona Cases : దేశంలో కొత్తగా 243 కరోనా కేసులు.. వైరస్ సోకి ఒకరి మృతి
భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 243 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ సోకి ఒకరు మృతి చెందారు.

new corona cases : కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా మరోసారి భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 243 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ సోకి ఒకరు మృతి చెందారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 2,13,080 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 243 కొత్త కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇప్పటివరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,46,78,158కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 5,30,699కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,609 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు నమోదైన మొత్త కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని పేర్కొంది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాల శాతం 1.19 శాతంగా ఉందని తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 220.09 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది.
Covid cases in January: దేశంలో కరోనా విజృంభించే ముప్పు.. తదుపరి 40 రోజులు కీలకం
మరోవైపు చైనాలో బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఈ కొత్త వేరియంట్ కారణంగా చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతన్నాయి. బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోకి కూడా ప్రవేశించింది. దేశంలో మూడు బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్ లో 2, ఒడిశాలో ఒక కేసు చొప్పున నమోదు అమ్యాయి. వీరి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు.