మమతకి భారీ షాక్..బీజేపీలోకి ఐదుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సువెందు అధికారి లాంటి పలువురు కీలక నేతలు అధికార టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరగా..సోమవారం ఒక్కరోజే ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి మమతకు భారీ షాక్​ ఇచ్చారు.

మమతకి భారీ షాక్..బీజేపీలోకి ఐదుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు

west bengal పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సువెందు అధికారి లాంటి పలువురు కీలక నేతలు అధికార టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరగా..సోమవారం ఒక్కరోజే ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి మమతకు భారీ షాక్​ ఇచ్చారు. తృణమూల్ ఎమ్మెల్యేలు.. రవీంద్రనాథ్​ భట్టాచార్య, దీపేందు బిశ్వాస్, సోనాలీ గుహా, జతు లహరి, శీతల్ కుమార్​ సర్దార్​ సోమవారం బెంగాల్​ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. హబీబ్​పుర్ నియోజకవర్గ​ టీఎంసీ అభ్యర్థి సరళ ముర్ము సైతం కమలదళంలో చేరారు. టీఎంసీ నేతలు పార్టీలో చేరే కార్యక్రమంలో బీజేపీ నేత సువేందు అధికారి, ముకుల్ రాయ్ పాల్గొన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తనను పట్టించుకోలేదని… పార్టీ కోసం ఎంత పనిచేసినా తనకు కనీస గౌరవం కూడా దక్కలేదని బీజేపీలో చేరిన టీఎంసీ ఎమ్మెల్యే సోనాలీ గుహ వాపోయారు. నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన సోనాలికి మమతా బెనర్జీ ఇటీవల విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో చోటు దక్కని విషయం తెలిసిందే. తన అభిప్రాయాలను మమతా ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని సోనాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీలో పార్టీ కోసం ఎలాగైతే కష్టపడ్డానో… బీజేపీ కోసం కూడా అంతే కృషి చేస్తానని సోనాలీ గుహా పేర్కొన్నారు.

అయితే, ఎంతమంది పార్టీని వీడినా గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నారు మమతా బెనర్జీ. బెంగాల్ గడ్డను బెంగాల్ బిడ్డనే పాలించాలన్న నినాదంతో ఆమె దూసుకెళ్తున్నారు. మరోవైపు టీఎంసీ పదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని… ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఆదివారం కోల్ కతాలో బీజేపీ బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని మోడీ కూడా మమతని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. మమత మారిపోయిందని..ముందులా లేదని మోడీ అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం అని..మమత ఆట ముగిసిందని మోడీ అన్నారు. ఈ నేపథ్యంలో చివరకు బెంగాల్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక, ఇప్పటికే విడుదలైన ఏబీపీ,సీ-ఓటర్ సర్వేలో బెంగాల్ లో మళ్లీ మమతదే గెలుపు అని తేలింది.

ఇక,294 స్థానాలున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ మార్చి-27 నుంచి ఏప్రిల్-29వరకు ఎనిమిది దశల్లో జరగనున్నాయి. మార్చి-27న మొదటి దశ,ఏప్రిల్-1న రెండో దశ,ఏప్రిల్-6న మూడో దశ,ఏప్రిల్-10న నాల్గవ దశ,ఏప్రిల్-17న ఐదవ దశ,ఏప్రిల్-22న ఆరవ దశ,ఏప్రిల్-26న ఏడవ దశ,ఏప్రిల్-29న ఎనిమిదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.