UP : లఖింపూర్ ఖేరిలో ఫుల్ టెన్షన్, అఖిలేష్ హౌస్ అరెస్టు..అసలు ఏం జరిగింది ?

లఖీంపూర్‌కు వెళ్లకుండా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో లక్నోలోని తన నివాసం ముందే నిరసనకు దిగారు అఖిలేశ్ యాదవ్‌.

UP : లఖింపూర్ ఖేరిలో ఫుల్ టెన్షన్, అఖిలేష్ హౌస్ అరెస్టు..అసలు ఏం జరిగింది ?

Up (2)

Akhilesh Yadav : ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లఖీంపూర్‌కు వెళ్లకుండా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో లక్నోలోని తన నివాసం ముందే నిరసనకు దిగారు అఖిలేశ్ యాదవ్‌. దేశంలో రైతులపై దాడులు బ్రిటీష్‌ పాలనను మించిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు అఖిలేశ్‌ యాదవ్. అన్నదాతలకు హోంశాఖ నుంచి వస్తున్న బెదిరింపులు హిట్లర్‌ను తలపిస్తున్నాయని అన్నారాయన.

Read More : Bollywood : రేవ్ పార్టీ కేసు, సమీర్ వాంఖెడే ఎవరో తెలుసా ?

2021, అక్టోబర్ 03వ తేదీ ఆదివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాణిస్తోన్న కారు కింద పడి నలుగురు రైతులు దుర్మరణం పాలు కావడం, ఆ తరువాత చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితుల్లో మరో నలుగురు మృతి చెందడంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. కేంద్రమంత్రి కుమారుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అజయ్‌ మిశ్రా కుమారుడితో పాటు మరో 14మందిపై మర్డర్‌ కేసు నమోదు చేశారు ప్రకటించారు పోలీసులు. ఎఫ్‌ఐఆర్‌లో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా పేరును కూడా చేర్చారు పోలీసులు. లఖింపూర్ ఖేరిలో పలుచోట్ల 144 సెక్షన్‌ను విధించారు పోలీసులు. కొత్త వారు ఎవరూ నగరంలోనికి రాకుండా ఉండేలా సరిహద్దుల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Read More : Ram Janmabhoomi Trust : క్షీణించిన మహంత్ గోపాల్‌దాస్ ఆరోగ్యం..లక్నోకి తరలింపు

లఖింపూర్ ఖేరి.. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా సొంత లోక్‌సభ నియోజకవర్గం. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచే గెలుపొందారు. తన నియోజకవర్గంలో పర్యటించడానికి వచ్చిన ఆయనను రైతులు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. ఆయన ప్రయాణిస్తోన్న కారుకు అడ్డుగా కూర్చున్నారు. అయినప్పటికీ- లెక్క చేయలేదని, కారును రైతుల మీదుగా పోనిచ్చారనే ఆరోపణలు అజయ్ మిశ్రాపై ఉన్నాయి. ధర్నా చేస్తోన్న రైతులపై కారును పోనివ్వడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరి కొందరు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.