Punjab Politics : కాంగ్రెస్‌కు బిగ్ షాక్..15 రోజుల్లో అమరీందర్ సింగ్ కొత్త పార్టీ!

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ తో సుదీర్ఘ అనుబంధానకి గుడ్ బై చెప్పి ఆ పార్టీ నుంచి బయటికొచ్చిన పంజాబ్ మాజీ సీఎం

Punjab Politics : కాంగ్రెస్‌కు బిగ్ షాక్..15 రోజుల్లో అమరీందర్ సింగ్ కొత్త పార్టీ!

Amarender (3)

Punjab Politics వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ తో సుదీర్ఘ అనుబంధానికి గుడ్ బై చెప్పి ఆ పార్టీ నుంచి బయటికొచ్చిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.. బీజేపీలో చేరతారని మొన్నటివరకు ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. అమిత్ షాతో బుధవారం అమరీందర్ సింగ్ భేటీ అవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే.. తాను బీజేపీలో చేరేది లేదని, కాంగ్రెస్‌తో కూడా కలిసి ఉండడం లేదని గురువారం అమరీందర్ సింగ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని సింగ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మరో 15 రోజుల్లోనే కొత్త రాజకీయ పార్టీని అమరీందర్ స్థాపించే అవకాశాలున్నాయని ఆయన సన్నిహిత వర్గాలు శుక్రవారం తెలిపాయి. కొత్త పార్టీతోనే వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రంగంలోకి దిగాలని కెప్టెన్ భావిస్తున్నారని వివరించాయి. కొత్త పార్టీ ఏర్పాటు విషయమై ఇప్పటికే ఆయన తన మద్దతుదారులతో చర్చలు జరపుతన్నారట. అంతేకాకుండా.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన 12 మంది కాంగ్రెస్ నాయకులు అమరీందర్ సింగ్ తో టచ్ లో ఉన్నారని సమాచారం. ఇందులో ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అమరీందర్ పెట్టబోయే కొత్త పార్టీలో వీరందరూ చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. పంజాబ్ కు చెందిన రైతు నేతలతోనూ అమరీందర్ సింగ్ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రైతు నేతలతో అమరీందర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

ఇక.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన తాజా రాజకీయ పరిణామాలతో పంజాబ్ లో అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ హైకమాండ్ ని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ రాజీనామా చేయడం, తదనంతరం జరిగిన పరిణామాలపై హైకమాండ్ కి సీఎం రిపోర్ట్ చేయనున్నారు. కాగా, గురువారం సీఎం చన్నీతో సిద్ధూ భేటీ అయిన విషయం తెలిసిందే. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి మూడు రోజుల క్రితం సిద్దూ రాజీనామా చేసినప్పటికీ.. ఇప్పటివరకు హైకమాండ్ ఆమోదించలేదు. అయితే.. సిద్దూ తన రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రాజీనామాపై సిద్ధూ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలున్నాయని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. పంజాబ్‌ పీసీసీ చీఫ్‌గా సిద్ధూనే కొనసాగుతారని, ఆయన నేతృత్వంలోనే వచ్చే ఏడాది కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుందని సదరు వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి చన్నీ అక్టోబర్ 4న అత్యవసర మంత్రివర్గ సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో… ఆ రోజునే అన్ని విషయాలకు సమాధానం దొరికే అవకాశం ఉందని తెలుస్తోంది. సిద్దూ ఆకాంక్షలకు అనుగుణంగా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ALSO READ ఈ నెల 7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 11న తిరుమలకు సీఎం జగన్