ఏపీలో పవన్ తో కలిసి పని చేస్తాం : ఏచూరి

  • Published By: chvmurthy ,Published On : March 4, 2019 / 12:01 PM IST
ఏపీలో పవన్ తో  కలిసి పని చేస్తాం : ఏచూరి

ఢిల్లీ:  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీ లో సిపిఐ, పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేస్తాం, తెలంగాణలో సిపిఐ, బీ.ఎల్.ఎఫ్ తో కలిసి పోటీ చేస్తామని,  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి  చెప్పారు . లోక్ సభ ఎన్నికల పొత్తులపై మాట్లాడుతూ ఆయన “తమిళనాడు లో డీఎంకే తో సీట్ల కోసం చర్చలు జరుపుతున్నామని,  బీహార్ లో ఆర్జేడీ తో పొత్తు లో భాగంగా ఒక సీటు లో పోటీ చేస్తాం అని చెప్పారు.

ఒడిశాలో భువనేశ్వర్ ఎంపీ సీటు కు పోటీ చేస్తాం అన్నారు. “వెస్ట్ బెంగాల్ లో బీజేపీకి, తృణమూల్ వ్యతిరేకంగా మా పోరాటం ఉంటుందని, లెఫ్ట్ ఫ్రంట్ , కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లలో ఒకరిపై ఒకరు పోటీ చేయవద్దని ప్రతిపాదన చేశాం, కేరళ లో ఎల్.డీ.ఎఫ్.కు యుడీఎఫ్ కు మధ్య పోరాటం ఉంటుంది, కేరళ లో మేము ఈ సారి ఎక్కువ సీట్లు గెలుస్తాం అని ఆశాభావం వ్యక్తం చేశారు. సీట్ల సంఖ్య పై చర్చలు జరుగుతున్నాయని ,వివరాలు త్వరలో ప్రకటిస్తాం అని ఆయన తెలిపారు.
Also Read : పాక్ కు బుద్ధి చెప్పాల్సిందే : ఐరాస వద్ద నిరసల హోరు

ఎన్నికల్లో లబ్దికోసమే  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  సైనికుల దాడులను  రాజకీయం చేస్తున్నారు అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. కాశ్మీరీలను పరాయి వారిగా మార్చడం హేయనీమైన చర్య అని ఆయన చెప్పారు.

దేశంలో ఆర్థిక వృద్ధరేటు పడి పోయింది, నిరుద్యోగం పెరిగింది, వ్యవసాయం వృద్ధి పడిపోయింది అని ఆయన తెలిపారు. అనుభవం లేని అడాని గ్రూపు కు విమానాశ్రయాల ప్రైవేటీకరణ అప్పగించారు. ఆధార్ డేటా బేస్ ను ప్రైవేట్ సంస్థలు ఉపయోగించు కునేందుకు తెచ్చిన ఆర్డినెన్సు కు రాష్ట్రపతి ఆమోదం తెలప కూడదు అని ఆయన కోరారు.  
Also Read : అభినందన్ తరహా మీసం, హెయిర్ స్టైల్ పై యువత ఉత్సాహం