Assembly Elections : ఎన్నికల ప్రచార ర్యాలీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం
ఎన్నికలు జరగాల్సి ఉన్న ఐదు రాష్ట్రాల్లో బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలను నిర్వహించడం, కోవిడ్ పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం అవుతోంది.

Election commission of India
Assembly Elections : ఎన్నికలు జరగాల్సి ఉన్న ఐదు రాష్ట్రాల్లో బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలను నిర్వహించడం, కోవిడ్ పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం అవుతోంది.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర వర్చువల్‌గా జరిపే ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, ఐదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు,ఆరోగ్య కార్యదర్శులు,రాష్ట్రాల ఎన్నికల ప్రధాన కార్యదర్శులు పాల్గోంటారు.
ఎన్నికల ప్రచార ర్యాలీలపై ఈసీ తీసుకోబోయే నిర్ణయం కోసం రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. జనవరి 8 నుంచి ఉత్తర ప్రదేశ్‌తో సహా ఎన్నికలు జరగాల్సి ఉన్న ఐదు రాష్ట్రాల్లో బహిరంగ ఎన్నికల ప్రచార ర్యాలీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. కోవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా బహిరంగ ర్యాలీలు, రోడ్ షో లపై కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 31 వరకు ఆంక్షలను పొడిగించిన సంగతి తెలిసిందే.
Also Read : Telangana : డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్న తెలంగాణ