Farmers’ protest : UP రైతులతో చర్చించేందుకు మోడీ సిద్ధం

Farmers’ protest : UP రైతులతో చర్చించేందుకు మోడీ సిద్ధం

PM-Modi

PM Modi to interact with farmers : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు.. తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే కొత్త చట్టాలతో రైతులకు ఇబ్బంది లేదని ప్రకటించిన ప్రధాని మోదీ.. స్వయంగా రైతులతో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతిని పురస్కరించుకొని డిసెంబర్‌ 25న ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌ రైతులతో ముచ్చటించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 2 వేల 500కు పైగా ప్రాంతాల్లో కిసాన్‌ సంవాదక్‌ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపింది.. బీజేపీ.

ఇప్పటికే మధ్యప్రదేశ్‌ రైతులతో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. చట్టాలను రాత్రికి రాత్రే తీసుకురాలేదని, వాటిని రూపొందించేందుకు దశాబ్దాలుగా చర్చలు, సంప్రదింపులు జరిగాయన్నారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్టాలకోసం రైతులు దశాబ్దాలుగా డిమాండ్‌ చేస్తున్నారని, రాజకీయ పార్టీల గత మేనిఫెస్టోలను చూస్తే ఈ వాగ్దానాలే కనిపిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు ప్రధాని మోడీ. ప్రతిపక్షాలకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, కావాలనే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారాయన.

మరోవైపు.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనలు 2020, డిసెంబర్ 20వ తేదీ ఆదివారంతో 25వ రోజుకు చేరుకున్నాయి. ఎముకలు కొరికే చలిలో సైతం రైతులు పట్టువిడవకుండా నిరసనదీక్షలు కొనసాగిస్తున్నారు. రైతులు, ప్రభుత్వానికి మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ అవి సఫలం కాలేదు. కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేని డిమాండ్‌ చేస్తున్నారు. రైతులు. ఆందోళనలు ప్రారంభమైన తర్వాత పలు కారణాలతో 33 మంది రైతులు చనిపోయారు. ఆ అమరవీరులకు రైతు సంఘాలు శ్రద్ధాంజలి ఘటించాయి.