Karnataka: కొత్త డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమంటున్న తమిళనాడు.. మళ్లీ రాజుకున్న వివాదం

తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి స్పందిస్తూ తమ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

Karnataka: కొత్త డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమంటున్న తమిళనాడు.. మళ్లీ రాజుకున్న వివాదం

Palaniswami - DK Shivakumar

Karnataka – Tamil Nadu: కర్ణాటక మేకెదాటు ప్రాజెక్టు (Mekedatu project)పై మళ్లీ వివాదం రాజుకుంది. కావేరీ (Cauvery) నది ప్రవహించే మేకెదాటు వద్ద రిజర్వాయర్ నిర్మిస్తామని కర్ణాటక కొత్త డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) తాజాగా వ్యాఖ్యానించారు. దీంతో తమిళనాడు భగ్గుమంటోంది.

డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని తమిళనాడు జలవనరుల శాఖ మంత్రి దురైమురుగన్ అన్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకే పొరుగు రాష్ట్రాన్ని డీకే శివకుమార్ ఆటపట్టిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. డీకే శివకుమార్ కు అధికారులు మేకెదాటు ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు చెప్పలేదేమోనంటూ చురకలంటించారు. మేకెదాటు ప్రాజెక్టును వ్యతిరేకిందుకు అన్ని రకాలు ప్రయత్నిస్తామని చెప్పారు.

డీకే శివకుమార్ వ్యాఖ్యలపై ఇవాళ తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఈ. పళనిస్వామి స్పందించారు. తమిళనాడును ఎడారిగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మేకెదాటు ప్రాజెక్టుపై కర్ణాటక ముందుకు వెళ్తే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

తమిళనాడులోని డీఎంకే సర్కారు ఈ విషయంపై సరిగ్గా స్పందించడం లేదని, దీన్ని వినోదభరితంగా చూస్తోందని విమర్శించారు. తమిళనాడును ఎడారిగా మార్చాలని మార్చాలని చూస్తే తమ పార్టీ అన్ని రకాలుగా ఆందోళనలకు దిగుతుందని హెచ్చరించారు. కావేరీ నీటి వివాదమైనా, మేకెదాటు విషయమైనా తమ పార్టీ గట్టిగానే వ్యతిరేకిస్తోందని, డీఎంకే మాత్రం స్పందించడం లేదని విమర్శించారు.
Maha Jansampark Abhiyan : ఎలక్షన్ మూడ్‌లోకి బీజేపీ.. దేశంలో మూడోసారి అధికారం కోసం స్కెచ్