జై శ్రీరామ్ : అయోధ్య రామాలయం విరాళాల సేకరణ కంప్లీట్..ఎంత వచ్చాయంటే..

జై శ్రీరామ్ : అయోధ్య రామాలయం విరాళాల సేకరణ కంప్లీట్..ఎంత వచ్చాయంటే..

Ayodhya-Rammandir

Ayodhya : అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఆలయానికి సంబంధించిన విరాళాల సేకరణ పూర్తయ్యింది. దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. 44 రోజుల పాటు నిర్వహించిన విరాళాల సేకరణ 2021, ఫిబ్రవరి 27వ తేదీ శనివారంతో ముగిసిందని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది. మొత్తం రూ. 2 వేల 500 కోట్ల విరాళాలు వచ్చాయని, నగదుకు సంబంధించి అడిట్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే..చాలా నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉందని, ఇది పూర్తయితే..విరాళాల మొత్తం పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇందుకు ఒక యాప్ రూపొందించినట్లు, ఇందులో పాల్గొనే వారు..ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ కావాల్సి ఉంటుందని వెల్లడించింది. ప్రతిరోజూ డేటాను యాప్ లో పొందుపరచాల్సి ఉంటుందని వివరించారు. ఈ ప్రక్రియ నెలరోజుల పాటు సాగనుందని తెలిపింది. ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా హిందువులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. రామమందిర నిర్మాణానికి హిందువులే కాకుండా వివిధ వర్గాలకు చెందిన రామభక్తులు సైతం దీనిలో పాలుపంచుకుంటున్నారు.

దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం మందిర నిర్మాణం జరుగుతుండటంతో ఆలయ కమిటీ సైతం పెద్ద ఎత్తున నిధులను సేకరించింది. చరిత్రలో నిలిచిపోయే విధంగా అయోధ్యలో రామమందిరం నిర్మించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాల్లో 11 కోట్లు కుటుంబాలను ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయాలని నిర్ణయించారు.

దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా నిధులను సమీకరించారు. జనవరి 15 నుంచి పిబ్రవరి 27 వరకు దేశవ్యాప్తంగా విరాళాల కార్యక్రమాన్ని చేపట్టింది. అయోధ్యలోని 2.7 ఎకరాల స్థలంలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. 15 వందల కోట్లతో ఆలయాన్ని నిర్మించాలని ప్రణాళికలు తయారు చేయగా ఇప్పటికే ఆ మార్క్‌ దాటేసింది.