Tejashwi Yadav: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తేజస్వీ యాదవ్ భార్య
ఆసుపత్రిలో తన భార్య, కూతురితో తేజస్వీ యాదవ్ ఫొటోలు దిగి, వాటిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆర్జేడీ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

Tejashwi Yadav
Tejashwi Yadav: బిహార్ (Bihar) డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ( Tejashwi Yadav) తండ్రి అయ్యారు. ఆయన భార్య రాజశ్రీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన కూతురిని ఎత్తుకుని తేజస్వీ యాదవ్ ఫొటో దిగాడు. అలాగే, ఆసుపత్రిలో తన భార్య, కూతురితో ఫొటోలు దిగి, వాటిని తన ట్విట్టర్ ఖాతాలో తేజస్వీ యాదవ్ పోస్ట్ చేశారు. దీంతో ఆర్జేడీ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
కాగా, లాండ్ ఫర్ జాబ్స్ (Land for Jobs Scam) కుంభకోణం కేసులో తేజస్వీ యాదవ్ కు సీబీఐ నుంచి ఇటీవల సమన్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను విచారణకు రాలేనని, గర్భంతో ఉన్న తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని తేజస్వీ యాదవ్ చెప్పారు. అనంతరం తేజస్వీకి సీబీఐ మళ్లీ సమన్లు జారీ చేయగా, తన భార్య ఆసుపత్రిలో ఉన్నందున విచారణకు రాలేనని తేజస్వీ సమాధానం ఇచ్చారు.
అంతకు ముందు తేజస్వీకి చెందిన ఢిల్లీ నివాసంలో ఈడీ కూడా సోదాలు నిర్వహించింది. తేజస్వీ తల్లిదండ్రులు, బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిని కూడా కొన్ని రోజుల క్రితం సీబీఐ విచారించింది. రైల్వే శాఖ మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ పనిచేస్తోన్న సమయంలో లాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం జరిగింది.
Lok Sabha elections-2024: ఎన్నికల ముందు రాజకీయాల్లోకి శిఖర్ ధావన్?