ఎగ్జిట్ పోల్స్ : మహారాష్ట్రలో బీజేపీ-శివసేనదే అధికారం

  • Published By: venkaiahnaidu ,Published On : October 21, 2019 / 01:11 PM IST
ఎగ్జిట్ పోల్స్ : మహారాష్ట్రలో బీజేపీ-శివసేనదే అధికారం

మహారాష్ట్రలో మరోసారి బీజేపీ-శివసేన కూటమినే అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తెలిపింది. బీజేపీకి 109-124 సీట్లు వస్తాయని,శివసేనకు 57-70సీట్లు వస్తాయని తెలిపింది. రెండు పార్టీలు కలిసి 166-194సీట్లు వస్తాయని తెలిపింది.

ఇక కాంగ్రెస్-ఎన్సీపీ మరోసారి భంగపాటు తప్పదని తెలిపింది. కాంగ్రెస్ కు 32-40సీట్లు,ఎన్సీపీకి 40-52 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే ఇతరులు 22-32స్థానాలు కైవసం చేసుకునే అవకాశముందని తెలిపింది. మొత్తం 288 సీట్లు ఉన్న మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమికి 230 సీట్లు వస్తాయని న్యూస్ 24టైమ్స్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి 48 సీట్లు వచ్చే అవకాశముందని తెలిపింది. మహారాష్ట్రలో సాయంత్రం 6గంటలకు 55.33శాతం పోలింగ్ నమోదైంది.

అక్టోబర్-24,2019న ఫలితాలు వెలువడనున్నాయి.హర్యానా,మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలలోని 51 అసెంబ్లీ స్థానాలకు,రెండు లోక్ సభ స్థానాలకు కూడా ఇవాళ ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఇవాళే ఉప ఎన్నిక జరిగింది.