Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్ : భారత పురుషుల హాకీ జట్టుకు కాంస్య పతకం
41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత పురుషుల హాకీ జట్టు తెరదించింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత్‌కు 12వ మెడల్ దక్కింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో జర్మనీపై టీమిండియా విక్టరీ కొట్టింది.

Tokyo Olympics
Indian hockey : 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత పురుషుల హాకీ జట్టు తెరదించింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత్‌కు 12వ మెడల్ దక్కింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో జర్మనీపై టీమిండియా విక్టరీ కొట్టింది. హోరాహోరీ పోరులో 5-4 గోల్స్ తేడాతో మన్‌ప్రీత్ సేన విజయం సాధించింది. 41ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత హాకీకి మెడల్ దక్కింది. చివరగా.. 1980మాస్కో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం దక్కింది. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. జర్మనీ దూకుడుకు కళ్లెం వేస్తూ అద్భుత ప్రదర్శన కనబరిచారు. జర్మనీ గోల్ పోస్ట్‌లపై దాడి చేశారు. ఏకంగా 5 గోల్స్ కొట్టి బ్రాంజ్ మెడల్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఒకప్పుడు గొప్పగా వెలిగి.. ఆపై మసకబారిన టీమ్ఇండియా.. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మెరిసింది. అభిమానులను ఉర్రూతలూగించే గొప్ప విజయాన్ని సాధించింది. స్ఫూర్తిదాయక ఆటతో మన్‌ప్రీత్ బృందం ఒలింపిక్స్‌లో కాంస్య పతకాని సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి గొప్ప జట్లకే చుక్కలు చూపించారు. మళ్లీ 1980కి ముందు రోజులు గుర్తు చేశారు. ఇక ఇండియన్ హాకీ పనైపోయిందన్న నోళ్లను మూయించారు. మనలో ఏమాత్రం సత్తా తగ్గలేదన్న విషయాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు.
నిజానికి టోక్యో ఒలింపిక్స్ మొదలైనప్పుడు హాకీలో ఈ స్థాయి దూకుడును ఎవరూ అంచనా వేయలేదు. కొందరైతే అసలు మన టీమ్‌లు క్వార్టర్ ఫైనల్ వరకైనా చేరుకుంటారా ? అని సందేహం వ్యక్తం చేశారు. దీనికి గతంలో వరుస అపజయాలు కూడా ఓ కారణమే. ఈసారి కూడా మన హాకీ టీంలు నిరాశతో వెనుదిరగాల్సిందేనని అంతా భావించారు. ఎందుకంటే మనకు చివరగా 1980 మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌లో స్వర్ణం వచ్చింది. అంతే ఆ తర్వాత హాకీ టీంకు ప్రతీసారి ఒలింపిక్స్‌లో ఎదురుదెబ్బే తగిలింది. 40 ఏళ్లుగా ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా దక్కని ఆపవాదును మూటగట్టుకున్న హాకీ టీమ్ టోక్యోలో అందరీ విమర్శలకు చెక్‌పెట్టింది టీమిండియా.
1980కు ముందు ఇండియన్ హాకీకి స్వర్ణయుగం. హాకీ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది ఇండియానే. అప్పటి దిగ్గజ ఆటగాళ్ల ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. గ్రౌండ్లోకి ఇండియా దిగిదంటే ప్రత్యర్థి టీంకు చుక్కలు కనబడాల్సిందే. ఇండియా హాకీ టీమ్‌తో ఆడడమంటేనే ప్రత్యర్థి ఓడిపోయినట్లు. భారత హాకీ జట్టంటే అగ్రదేశాలకు సైతం హడల్… మనపై ఒక్క గోల్ చేస్తే చాలు గెలిచినంత సంబరాలు చేసుకునే వాళ్లు. హాకీ మన బ్లడ్‌లోనే ఉంది. సరైన సౌకర్యాలు లేకుండానే మోడ్రన్ టెక్నిక్స్‌తో పని లేకుండానే ప్రపంచ హాకీని భారత్ ఏలింది. ప్రత్యర్థులకు సింహస్వప్నంగా నిలిచింది. తాజాగా భారత్ గెలుపుతో మళ్లీ అలాంటి పుర్వవైభవం రానుందనే విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒలింపిక్స్‌లో మన హకీ చరిత్ర చూస్తే 1928 నుంచి 1980 మధ్య మన హాకీకి స్వర్ణయుగం నడిచింది. 12 ఒలిపిక్స్లో ఏకంగా 11 పతకాలు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. 1928 నుంచి 1956 వరకు వరుసగా ఆరుసార్లు స్వర్ణం గెలవడం అంటే మాటలు కాదు. అంటే 28 ఏళ్ల పాటు మనకు తిరుగు లేకుండా పోయింది. ఇండియా హాకీ టీం బరిలో ప్రత్యర్థులు సెకండ్, థర్డ్ ప్లేస్ కోసం చూడడం తప్ప ఫస్ట్ ప్లేస్ కోసం కలలో కూడా ప్రయత్నించే సాహసం చేయలేకపోయేవారు.
అయితే 1960లో మన టీం రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒలింపిక్స్‌కు టీమ్ పుంజుకుంది. 1964 మళ్లీ గోల్డ్ గెలుచుకుని మనకు తిరుగులేదని నిరూపించింది. 1968 మెక్సికో ఒలింపిక్స్, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్యంకే పరిమితం అయింది. చివరిసారిగా మన హాకీం టీం 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న భారత్‌కు మళ్లీ 41ఏళ్ల తర్వా మెడల్ గెలిచింది.