Human Sacrifice : సంతానం కోసం దారుణం.. వేశ్యలను తీసుకొచ్చి శృంగారం చేసి..

సైన్స్ ఎంతగానో డెవలప్ అయ్యింది. మనిషి ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాడు. స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్నాడు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ దేశంలో ఇంకా మూఢ

Human Sacrifice : సంతానం కోసం దారుణం.. వేశ్యలను తీసుకొచ్చి శృంగారం చేసి..

Human Sacrifice

Human Sacrifice : సైన్స్ ఎంతగానో డెవలప్ అయ్యింది. మనిషి ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాడు. స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్నాడు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ దేశంలో ఇంకా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, క్షుద్ర విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. మూఢనమ్మకాలతో కొందరు వ్యక్తులు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. తోటి మనిషి ప్రాణాలు తీస్తున్నాడు. తాజాగా మూఢనమ్మకంతో ఓ జంట చేసిన పని సంచలనంగా మారింది.

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. సంతానం కోసం ఓ జంట నరబలి ఇచ్చిన ఘటన సంచలనం రేపింది. గ్వాలియర్ లో నివసించే బంటు బదౌరియా, మమతా దంపతులకు 18 ఏళ్ల కిందట పెళ్లైంది. ఇప్పటికీ పిల్లలు కలగలేదు. వారి కుటుంబ స్నేహితుడు నీరజ్ పర్మార్ సలహా మేరకు గిర్వార్ యాదవ్ అనే భూతవైద్యుడ్ని సంప్రదించారు. పిల్లలు పుట్టాలంటే నరబలి ఒక్కటే మార్గమని అతడు చెప్పడంతో బంటు, మమత సరేనన్నారు.

Amazon లో రూ.70వేల ఖరీదైన ఫోన్ ఆర్డర్‌ చేస్తే అంట్లు తోమే సోప్ పంపారు

బలి ఇచ్చేందుకు తగిన వ్యక్తిని తీసుకొచ్చే బాధ్యతను వారు నీరజ్ పర్మార్ కు అప్పగించారు. నీరజ్ ఓ వేశ్యను తీసుకొచ్చాడు. వారు ఆమెను బలిచ్చారు. ఆ తర్వాత మృతదేహాన్ని బైక్ పై తరలించే ప్రయత్నంలో కిందపడిపోవడంతో నీరజ్ భయపడ్డాడు. దాంతో ఆ వేశ్య మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ తర్వాత మరో వేశ్యను తీసుకొచ్చి భూత వైద్యుడి సమక్షంలో బలి ఇచ్చారు. అయితే, మొదట బలి ఇచ్చిన వేశ్య మృతదేహం వెలుగుచూడడంతో పోలీసులు దర్యాప్తు ఆరంభించగా, నరబలి వ్యవహారం బట్టబయలైంది. చనిపోయిన వేశ్య ఫోన్ లో కాంటాక్ట్ లిస్ట్ ద్వారా పోలీసులు నిందితులను పట్టుకోగలిగారు.

Porn : షాకింగ్.. పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ 11ఏళ్ల బాలురు.. దానికి ఒప్పుకోలేదని బాలిక హత్య

నీరజ్ పర్మార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్ లో ఎంక్వైరీ చేశారు. నీరజ్ ను నాలుగు పీకారు. అంతే, మనోడు నిజాన్ని కక్కేశాడు. దాంతో బంటు, మమతా దంపతులతో పాటు మమతా సోదరి మీరా రజావత్, భూతవైద్యుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మొదటి వేశ్యను నరబలి ఇచ్చే ముందు నీరజ్ సర్మార్ ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. అంతేకాదు, మొదటి వేశ్య మద్యం తాగి ఉన్నందున ఆమె నరబలి చెల్లదని భూతవైద్యుడు చెప్పాడని దీంతో వారు రెండో వేశ్యను తీసుకొచ్చి నరబలి ఇచ్చారని పోలీసుల విచారణలో తేలింది. ఓ రాత్రి తనతో గడిపేందుకు వేశ్యకు నీరజ్ రూ.10వేలు ఆఫర్ చేశాడు. వేశ్యతో అతడితో సెక్స్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత నరబలి ఇచ్చారు.

ఆ తర్వాత మృతదేహాన్ని పూడ్చేందుకు బైక్ పై తీసుకెళ్తున్న సమయంలో బైక్ స్కిడ్ అయ్యింది. మృతదేహం రోడ్డుపై పడింది. దీంతో కంగారుపడిన నిందితులు మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయారు. ఆ తర్వాత మరో వేశ్యను తీసుకొచ్చి నరబలి ఇచ్చారు. ఆ వేశ్య మృతదేహాన్ని పోలీసులు మొరేనా జిల్లాలో గుర్తించారు. రెండో వేశ్యను బలిచ్చే ముందు కూడా నీరజ్ ఆమెతో సెక్స్ లో పాల్గొన్నాడని పోలీసులు చెప్పారు. అక్టోబర్ 13న తొలి నరబలి ఇచ్చారు. ఆ తర్వాత వారం రోజులకు అంటే అక్టోబర్ 20న రెండో నరబలి ఇచ్చారు. అక్టోబర్ 14న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అప్పటివరకు ఆ కేసులో ఒక్క క్లూ కూడా లేదు.

భూతవైద్యుడు మరిన్ని నరబలులు ఇచ్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వివరాలు రాబట్టేందుకు అతడికి నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలని నిర్ణయించారు.