Rahul Gandhi Tweet: క‌ంగ్రాట్స్ ఎలాన్ మ‌స్క్..! ప్ర‌తిప‌క్షాల గొంతును అణ‌చివేయ‌ర‌ని ఆశిస్తున్నాం.. ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ

ట్విట‌ర్‌ను కైవ‌సం చేసుకున్న ఎలాన్ మ‌స్క్ కు రాహుల్ గాంధీ అభినంద‌న‌లు తెలిపారు. ఇప్ప‌టికైన ట్విట‌ర్ యాజ‌మాన్యం.. ద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, వాస్తవాన్ని మరింత పటిష్టంగా తనిఖీ చేస్తుందని ఆశిస్తున్నామ‌ని రాహుల్ అన్నారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగా భారతదేశంలో ప్రతిపక్షాల గొంతును ఇకపై అణచివేయదని నేను ఆశిస్తున్నానంటూ రాహుల్ గాంధీ త‌న ట్వీట్ లో పేర్కొన్నారు.

Rahul Gandhi Tweet: క‌ంగ్రాట్స్ ఎలాన్ మ‌స్క్..! ప్ర‌తిప‌క్షాల గొంతును అణ‌చివేయ‌ర‌ని ఆశిస్తున్నాం.. ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi Tweet

Rahul Gandhi Tweet: టెస్లా సీఈవో ఎలాన్ మ‌స్క్ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట‌ర్‌ను కైవ‌సం చేసుకున్న విష‌యం విధిత‌మే. ట్విట‌ర్ ప‌గ్గాల‌ను స్వాధీనం చేసుకున్న కొద్దిగంట‌ల్లోనే న‌లుగురు టాప్ ఎగ్జిక్యూటివ్‌ల‌ను మ‌స్క్ తొల‌గించాడు. అందులో భార‌త సంతితికి చెందిన ట్విట‌ర్ సీఈవో ప‌రాగ్ అగ్వాల్, విజ‌య గద్దెల‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ఉన్నారు. ట్విట‌ర్‌ను ఎలాన్ మ‌స్క్ కైవ‌సం చేసుకున్న సంద‌ర్భంగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. మ‌స్క్ కు అభినంద‌న‌లు తెలుపుతూనే భార‌త్‌లో ప్ర‌తిప‌క్షాల గొంతును అణ‌చివేయ‌ర‌ని ఆశిస్తున్నాం అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

Rahul Gandhi: ‘భారత్ జోడో యాత్ర’ సిబ్బంది, సహాయకులకు రాహుల్ కానుకలు.. వెండి నాణేలు, స్వీట్లు బహూకరణ

ట్విట‌ర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాహుల్ గాంధీ గ‌తంలో అత్యాచార బాధితురాలి ఫోటోను షేర్ చేయడంతో పాటు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) నుండి నోటీసు అందుకున్నారు. దీంతో రాహుల్ గాంధీ ట్విట్టర్ లో త‌న ఖాతాను కొద్దికాలం తాత్కాలికంగా నిలిపివేశారు. కొంతకాలం త‌రువాత త‌న ట్విట్టర్ ఖాతా ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం తీరుపై ట్వీట్ల‌తో విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తూ వ‌స్తున్నారు.

Bharat Jodo Yatra Telangana: తెలంగాణ‌లో కొన‌సాగుతున్న రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర (ఫొటో గ్యాల‌రీ)

తెలంగాణ‌లో భార‌త్ జోడో యాత్ర‌లో ఉన్న రాహుల్ గాంధీ ట్విట‌ర్‌ను కైవ‌సం చేసుకున్న ఎలాన్ మ‌స్క్ కు అభినంద‌న‌లు తెలిపారు. ఇప్ప‌టికైన ట్విట‌ర్ యాజ‌మాన్యం.. ద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, వాస్తవాన్ని మరింత పటిష్టంగా తనిఖీ చేస్తుందని ఆశిస్తున్నామ‌ని రాహుల్ అన్నారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగా భారతదేశంలో ప్రతిపక్షాల గొంతును ఇకపై అణచివేయదని నేను ఆశిస్తున్నానంటూ రాహుల్ గాంధీ త‌న ట్వీట్ లో పేర్కొన్నారు.

త‌న ట్విట‌ర్ ఖాతా గ్రాఫ్‌ను కూడా రాహుల్ గాంధీ పంచుకున్నాడు. ఈ గ్రాఫ్ ప్ర‌కారం.. 2021 ఆగ‌స్టు నుంచి 2022 ఫిబ్రవరి మధ్య కాలంలో రాహుల్ గాంధీ ట్విట‌ర్ ఖాతాలోకి కొత్త వ్య‌క్తులు రాకుండా ఎలా అడ్డుకున్నారో అన్న విష‌యాన్ని గ్రాఫ్ ద్వారా రాహుల్ గాంధీ హైలెట్ చేసి చూపించాడు. ట్విట‌ర్ సంస్థ‌కు నేను 20 అప్పీళ్లు చేశానని గాంధీ పేర్కొన్నారు. 2002 ఫిబ్రవరి నుంచి మ‌ళ్లీ రాహుల్ గాంధీ ట్విట‌ర్ ఖాతాలో ఫాలోవ‌ర్స్ పెర‌గ‌డం గ్రాఫ్ ద్వారా చూడొచ్చు.