Corona Cases: రెండో రోజు.. రెండు లక్షలకు పైగా కేసులు

Corona Cases: రెండో రోజు.. రెండు లక్షలకు పైగా కేసులు

Corona Cases

దేశంలో ప్రతిరోజూ కొత్త కరోనా సోకిన వారి సంఖ్య రికార్డులను బద్దలు కొడుతోంది. దేశంలో మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 2లక్షల 17వేల 353 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా.. 1185మంది ప్రాణాలు కోల్పోగా.. కరోనా నుంచి 1,18,302 మంది కోలుకున్నారు.

అంతకుముందు బుధవారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 200,739 కేసులు నమోదవగా.. పదకొండు వందలకు పైగా ఒకేరోజు మరణించడం గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే..

దేశంలో కరోనా..
మొత్తం కరోనా కేసులు – ఒక కోటి 42 లక్షలు 91 వేల 917
మొత్తం సోకినవారు – ఒక కోటి 25 లక్ష 47 వేల 866
మొత్తం క్రియాశీల కేసులు – 15 లక్ష 69 వేల 743
మరణించినవారు – 1 లక్ష 74 వేల 308
టీకా తీసుకున్నవారు – 11 కోట్ల 72 లక్షల 23 వేల 509మంది..

మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా తయారైంది. 61వేల 695 కొత్త కరోనా వైరస్ కేసులు నిన్న మహారాష్ట్రలో నమోదయ్యాక మొత్తం కేసుల సంఖ్య 36,39,855 కు పెరిగింది. ఈ అంటువ్యాధి కారణంగా 349 మంది మరణించగా, మరణించిన వారి సంఖ్య 59,153 కు పెరిగింది. కోవిడ్ -19 ఒక్క రోజులో నమోదైన కొత్త కేసులలో ఇది రెండవ అతి పెద్ద సంఖ్య. అంతకుముందు ఏప్రిల్ 11న 63,294 కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా మరణాల రేటు 1.23 శాతం కాగా, రికవరీ రేటు 88 శాతం. యాక్టివ్ కేసులు 10 శాతానికి పైగా పెరిగాయి. కరోనా యాక్టివ్ కేసుల్లో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. మొత్తం సోకిన వారి సంఖ్య ప్రకారం భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండగా.. కర్ఫ్యూలు కూడా విధించాయి ఆయా ప్రభుత్వాలు.