24గంటల్లో 34వేలకు పైగా కరోనా కేసులు

  • Published By: vamsi ,Published On : July 18, 2020 / 11:01 AM IST
24గంటల్లో 34వేలకు పైగా కరోనా కేసులు

భారత్‌లో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలో ఒక్క రోజులో అమెరికా తరువాత ఎక్కువ కరోనా కేసులు భారతదేశంలోనే నమోదయ్యాయి. బ్రెజిల్‌ను దాటి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో 1 మిలియన్ కేసులను భారత్ దాటింది. గత 24 గంటల్లో కరోనా సంక్రమణ అత్యధికంగా 34,884 కొత్త కేసులు దేశంలో నమోదయ్యాయి. ఇదే సమయంలో 671 మంది చనిపోయారు.

ఇదే సమయంలో భారత్ కంటే తక్కువగా.. కొత్తగా 33,959 కేసులు బ్రెజిల్‌లో నమోదయ్యాయి. భారతదేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య 10,38,716 కు పెరిగింది. వీటిలో 358,692 యాక్టివ్ కేసులు ఉండగా, 653,751 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 26,273 మంది ప్రాణాలు కోల్పోయారు.

కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య ప్రకారం భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. కరోనా మహమ్మారి వల్ల యునైటెడ్ స్టేట్స్ ఎక్కువగా ప్రభావితమవుతుంది. తర్వాత బ్రెజిల్ ప్రభావితం అయ్యింది.

పదిలక్షల జనాభాకు సోకిన కేసులు మరియు మరణాల విషయానికి వస్తే, ఇతర దేశాల కంటే భారతదేశం తక్కువగా ఉంది. భారతదేశం కంటే ఎక్కువ కేసులు అమెరికా (3,766,605), బ్రెజిల్ (2,048,697)లో నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.

క్రమ సంఖ్య రాష్ట్రం  పేరు మొత్తం కరోనా కేసులు
కోలుకున్నవారు మరణాలు
1 అండమాన్ నికోబార్ 194 142 0
2 ఆంధ్రప్రదేశ్ 40646 20298 534
3 అరుణాచల్ ప్రదేశ్ 609 175 3
4 అస్సాం 20646 14105 51
5 బీహార్ 23589 14621 201
6 చండీగఢ్ 660 480 11
7 ఛత్తీస్గఢ్ 4964 3512 23
8 ఢిల్లీ 120107 99301 3571
9 గోవా 3304 1946 21
10 గుజరాత్ 46430 32973 2106
11 హర్యానా 24797 18718 327
12 హిమాచల్ ప్రదేశ్ 1417 1024 11
13 జమ్మూ కాశ్మీర్ 12757 6558 231
14 జార్ఖండ్ 4921 2570 46
15 కర్ణాటక 55115 20757 1147
16 కేరళ 11066 4995 38
17 లడఖ్ 1151 973 1
18 మధ్యప్రదేశ్ 21081 14514 697
19 మహారాష్ట్ర 292589 160357 11452
20 మణిపూర్ 1800 1163 0
21 మేఘాలయ 403 66 2
22 మిజోరం 282 160 0
23 ఒడిషా 16110 11330 83
24 పుదుచ్చేరి 1832 1014 25
25 పంజాబ్ 9442 6373 239
26 రాజస్థాన్ 27789 20626 546
27 తమిళనాడు 160907 110807 2315
28 తెలంగాణ 42496 28705 403
29 త్రిపుర 2366 1684 3
30 ఉత్తరాఖండ్ 4102 3021 51
31 ఉత్తర ప్రదేశ్ 45163 27634 1084
32 పశ్చిమ బెంగాల్ 38011 22253 1049
భారతదేశంలో మొత్తం రోగుల సంఖ్య 1038716 653751 26273