కర్నాటకలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు, 10కి పెరిగిన సంఖ్య

కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల

  • Published By: veegamteam ,Published On : March 17, 2020 / 02:48 AM IST
కర్నాటకలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు, 10కి పెరిగిన సంఖ్య

కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల

కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10కి పెరిగింది. సోమవారం(మార్చి 16,2020) అర్థరాత్రి తర్వాత అధికారులు ప్రకటించారు. బెంగళూరులో ఇద్దరు, కలబుర్గిలో ఒకరికి కరోనా సోకినట్టు చెప్పారు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి కరోనా:
బాధితుల్లో ఒకరు 32ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్. మార్చి 8న లండన్ మీదుగా అమెరికా నుంచి వచ్చాడు. అప్పటి నుంచి ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాడు. రిపోర్టులో అతడికి పాజిటివ్ అని వచ్చింది. అతడు బెంగళూరుకి చెందిన 50 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగితో ప్రయాణం చేశాడు. అతడు కూడా కరోనా బారిన పడ్డాడు. మార్చి 10న రిపోర్టులో పాజిటివ్ అని వచ్చింది. ఇక మరో వ్యక్తి తుముకూరు వాసి. అతడు కూడా కరోనా బారిన పడ్డాడు. మార్చి 14న అతడి రక్త నమూనాలు సేకరించారు. రిపోర్టులో పాజిటివ్ అని వచ్చింది. కేసీ జనరల్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో అతడికి చికిత్స అందిస్తున్నారు. 

ఆందోళనలో బెంగళూరు వాసులు:
కర్నాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. సాఫ్ట్ వేర్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్ అయిన బెంగళూరులో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఆఫీస్ పని మీద విదేశాలకు వెళ్లి రావడం కామన్. అలా వెళ్లి వచ్చిన వారు కరోనా బారిన పడుతున్నారు. దీంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ముందు జాగ్రత్తలో భాగంగా వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించాయి. ఉద్యోగులు ఇళ్ల నుంచే వర్క్ చేసే అవకాశం ఇచ్చాయి. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చాయి. సినిమా థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్ పూల్స్, బార్లు మూసివేశాయి. జనం గుంపులుగా తిరగడాన్ని నిషేధించారు. ఇప్పటి వరకు మన దేశంలో కరోనా కేసుల సంఖ్య

పెరుగుతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య:
ఏఎఫ్‌పీ వార్తాసంస్థ లెక్కల ప్రకారం కరోనా వైరస్ 162 దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా లక్షా 82వేల 547 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6వేల 163 మందికి సీరియస్ గా ఉంది. మరణాల సంఖ్య 7వేల 164కు చేరుకుంది. అందులో చైనాలో 3,226 మంది మరణించగా, ఇటలీలో 2,158, ఇరాన్‌లో 853, స్పెయిన్‌లో 342 మంది చనిపోయారు. వైరస్‌ అని అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ పరీక్షించాలని డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటికే ప్రపంచ దేశాలకు సూచనలు చేసింది.

చైనా కంటే ఇతర దేశాల్లోనే ఎక్కువ:
ఫ్రాన్స్‌లో తొలివారం 12గా ఉన్న నిర్ధారిత కేసుల సంఖ్య నాలుగు వారాల్లో 4వేల 500కి పెరిగింది. ఇరాన్‌లో ఈ సంఖ్య 12వేల 700కి చేరింది. ఇటలీలో 24వేల మందికి వైరస్‌ సోకింది. ఇటలీలో మృతుల సంఖ్య 2వేలు దాటింది. స్పెయిన్‌లోనూ నాలుగు వారాల వ్యవధిలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8 నుంచి 6 వేలకు పెరిగింది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా పాజిటివ్‌గా తేలిన కేసుల సంఖ్య తక్కువే. అయినా ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో 124 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 39 కరోనా కేసులు నమోదయ్యాయి.