ఢిల్లీలో పెరిగిన వాయుకాలుష్యం…బలమైన గాలులు వీచే అవకాశం

  • Published By: venkaiahnaidu ,Published On : April 12, 2020 / 07:18 AM IST
ఢిల్లీలో పెరిగిన వాయుకాలుష్యం…బలమైన గాలులు వీచే అవకాశం

ఢిల్లీలో మళ్లీ ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనప్పటికీ, కొందరు చేసిన పిచ్చిపనుల కారణంగా వాయు కాలుష్యం పెరిగింది. ఆదివారం(ఏప్రిల్-12)జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం ఒక గీత పెరిగి “మితమైన(మోడరేట్)”కేటగిరీలో నిలిచింది. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) ప్రకారం….PM 2.5 అని పిలువబడే గాలిలోని చిన్న కణాలు 56 వద్ద నిలవగా, PM 10, 104 వద్ద “మోడరేట్” పరిధిలో ఉంది.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(CPCB)డేటా ప్రకారం… ఢిల్లీ టెక్నొలాజికల్ యూనివర్శిటీ వద్ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI)108గా ఉంది. ముందాకలో 131గా ఉండగా,ద్వారకాలో 96,ITOలో 80,జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 92వద్ద ఉంది.

ఢిల్లీలో గత వారం,ఎయిర్ క్వాలిటీ “గుడ్”కేటగిరీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా చీకట్లను జయించేందుకు ఏప్రిల్-5న దేశప్రజలందరూ దీపాలు వెలిగించాలని ప్రధాని మోడీ విజ్ణప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు మూర్ఖులు దీపాలు వెలిగించడానికి బదులుగా క్రాకర్స్ కాల్చారు. టపాసులు పేల్చారు.

దీంతో తగ్గిన ఎయిర్ పొల్యూషన్ కాస్తా మళ్లీ పెరగడానికి కారణమైంది. ఒక్క ఢిల్లీనే కాకుండా,దేశంలోని చాలా ప్రాంతాల్లో కొందరు ఆకతాయిలు దీపాలు వెలిగించేందుకు బదులుగా బాణసంచా పేల్చి వికృత చేష్టలకు పాల్పడ్డారు.

ఇక ఢిల్లీలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్(IMD)అంచనావేసింది. మరోవైపు దేశ ఆర్థికరాజధాని ముంబైలో82, పూణేలో65,అహ్మదాబాద్ లో 98 వద్ద AQI “సంతృప్తికర”కేటగిరీలో ఉంది.