ఢిల్లీలో దీపావళి బాణాసంచా కాల్చడం నిషేధం

  • Published By: bheemraj ,Published On : November 6, 2020 / 03:08 AM IST
ఢిల్లీలో దీపావళి బాణాసంచా కాల్చడం నిషేధం

Diwali fireworks ban : కరోనా వైరస్‌, కాలుష్యం నేపథ్యంలో దీపావళి నాడు ప్రజలు ఎవరు కూడా టపాసులు కాల్చొద్దని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. దీపావళి పండుగరోజు రాత్రి 7.39 గంటలకు ప్రభుత్వం లక్ష్మి పూజ నిర్వహిస్తోందని మంత్రులతో పాటు ప్రజలు కూడా ఆ వేడుకలలో పాల్గొనాలని కోరారు.



ఢిల్లీ ప్రస్తుతం రెండు సమస్యలతో బాధపడుతుందని ఒకటి కరోనా, మరొకటి వాయు కాలుష్యం అన్నారు. దీపావళికి టపాసులు కాల్చడం ద్వారా వాయు కాలుష్యం పెరిగే అవకాశాలు ఉన్నాయని అందుకే ప్రజలు ఎవరూ ఆ పని చేయొద్దని విజ్ఞప్తి చేశారు.



‘మేమందరం ఈ దీపావళిని కలిసి జరుపుకుంటాం. అయితే ఎవరం టపాసులు కాల్చం. ఇక్కడ మంచి వాతావరణంలో రెండు కోట్లమందికి మేలు జరగాలనే ఉద్దేశ్యంతో లక్ష్మి పూజ నిర్వహిస్తున్నాం. కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరగడానికి కూడా ఈ వాయు కాలుష్యం ఒక కారణం అని కేజ్రీవాల్ అన్నారు.



ఇప్పటికే కాలుష్యంతో ఢిల్లీ అల్లాడుతోందని అందుకే టపాసులు కాల్చవద్దన్నారు. అందరం కలిసి పూజ చేసుకుందామని సీఎం కోరారు. ఇదిలా వుండగా పశ్చిమ బెంగాల్‌ ఈ ఏడాది బాణాసంచా అమ్మకాలను నిషేధించారు.