SBI : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త.. ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్

ఆ మేసేజ్ లో పంపిన లింక్ ని క్లిక్ చేసి అందులో వివరాలు పొందుపరుస్తున్నారు. కట్ చేస్తే.. వారికి తెలియకుండానే వారి బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయమవుతోంది.

SBI : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త.. ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్

Sbi

SBI : సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి వారి బ్యాంకు ఖాతాల్లోని డబ్బు మాయం చేస్తున్నారు. తాజాగా సైబర్ క్రిమినల్స్ కన్ను ఎస్బీఐ కస్టమర్లపై పడింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఎస్బీఐ కస్టమర్లను అలర్ట్ చేసింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Tomatoes : టమాటాలు తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయా?

మ్యాటర్ ఏంటంటే.. మీ ఎస్బీఐ బ్యాంకు ఖాతాకు సంబంధించి పత్రాలు ఎక్స్ పైరీ అయ్యాయి. మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అయ్యింది.  పునరుద్ధరించాలంటే వెంటనే డాక్యుమెంట్లు అప్ డేట్ చేయాలని మేసేజ్ లు వస్తున్నాయి. కొందరు నిజమేనేమో అని కంగారుపడిపోతున్నారు. ఆ మేసేజ్ లో పంపిన లింక్ ని క్లిక్ చేసి అందులో వివరాలు పొందుపరుస్తున్నారు. కట్ చేస్తే.. వారికి తెలియకుండానే వారి బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయమవుతోంది.

VIVO V23 PRO 5G: రంగులు మార్చుకునే VIVO ఫోన్

దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఆ మేసేజ్ లు ఫేక్ అని తేల్చింది. ఆ మేసేజ్ లో వాస్తవం లేదంది. ఎస్బీఐ అకౌంట్ బ్లాక్ అయిందనే సాకుతో ఓ లింకు పంపి, అప్ డేట్ చేయాలని సైబర్ క్రిమినల్స్ నమ్మిస్తారంది. పొరపాటున కానీ లింక్ క్లిక్ చేసి వివరాలు ఇచ్చామో ఇక అంతే సంగతులు. వివరాలు ఇవ్వగానే బ్యాంకు ఖాతాలోని డబ్బును ఖాళీ చేస్తారని హెచ్చరించింది. వాస్తవానికి బ్యాంకులు ఇలాంటి మేసేజ్ లను అసలు పంపవని, ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించాలని ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది.