Ganga River : భూమిపై అత్యధిక మంది సందర్శించే యాత్రస్థలం గంగ

భారత్‌లో గంగా నదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నదిలో పుణ్యస్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం. ప్రపంచంలోనే అత్యధిక మంది సందర్శించే యాత్రస్థలం గంగ

Ganga River : భూమిపై అత్యధిక మంది సందర్శించే యాత్రస్థలం గంగ

Ganga River

Ganga River : భారత్‌లో గంగా నదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నదిలో పుణ్యస్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం. ప్రపంచంలోనే అత్యధిక మంది సందర్శించే యాత్రస్థలం గంగ అని.. ప్రతిఏడు సుమారు రెండు కోట్లమంది వస్తున్నట్లుగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గంగానదిని శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన వివరించారు. గంగా ఉత్సవ్ సందర్బంగా మాట్లాడిన కిషన్ రెడ్డి గంగను పరిశుభ్రంగా ఉంచుకోవడాన్ని ఆచారంగా మార్చుకోవాలని సూచించారు.

చదవండి : Ganga Snan in Haridwar: హరిద్వార్‌లో గంగా నదీ స్నానాలు రద్దు

ఇక జల్‌శక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ పటేల్ మాట్లాడుతూ గంగా ప్రక్షాళనకు సహకరిస్తున్న వారు రక్షకులని అభివర్ణించారు. నదులను పరిరక్షించేందుకు స్వచ్చందసంస్థలు ముందుకు రావాలని కోరారు ప్రహ్లాద్. నదులను కాలువలుగా చూడొద్దని, కాలువ మన కోరిక మేరకు ప్రవహిస్తుంది.. కానీ గంగా వంటి నదులు స్వతంత్రంగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు గంగపై పుస్తకం, ‘గంగా కీ బాత్‌ – చాచా చౌదరి కే సాథ్‌’ అనే కామిక్‌ సిరిస్‌ను విడుదల చేశారు.

చదవండి : Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తలకు గాయం