Gautam Adani: దివా జైమిన్ షాతో గౌతమ్ అదానీ తనయుడు జీత్ అదానీ నిశ్చితార్థం

గుజరాత్, అహ్మదాబాద్‌లో గౌతమ్ తనయుడు జీత్ అదానీ-దివా జైమిన్ షా నిశ్చితార్థ వేడుక జరిగింది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. గౌతమ్ అదానీ ఇంట అడుగుపెట్టబోయే కోడలు దివా జైమిన్. ఆమె ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కూతురు. వారికి సి.దినేష్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో వజ్రాల వ్యాపారం ఉంది.

Gautam Adani: దివా జైమిన్ షాతో గౌతమ్ అదానీ తనయుడు జీత్ అదానీ నిశ్చితార్థం

Gautam Adani: ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ తనయుడి నిశ్చితార్థం గత ఆదివారం జరిగింది. గుజరాత్, అహ్మదాబాద్‌లో గౌతమ్ తనయుడు జీత్ అదానీ-దివా జైమిన్ షా నిశ్చితార్థ వేడుక జరిగింది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.

Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు.. మూడు రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే..

గౌతమ్ అదానీ ఇంట అడుగుపెట్టబోయే కోడలు దివా జైమిన్. ఆమె ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కూతురు. వారికి సి.దినేష్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో వజ్రాల వ్యాపారం ఉంది. గుజరాతీ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు తాజాగా విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్‌లో జీత్ అదానీ తన విద్యాభ్యాసం పూర్తి చేశాడు.

అనంతరం 2019లో అదానీ సంస్థలో చేరి, కంపెనీకి చెందిన ఆర్థిక వ్యవహారాలు చూసే విభాగంలో వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నాడు. అదానీ సంస్థలకు సంబంధించిన ఎయిర్‌పోర్ట్ వ్యాపారం, డిజిటల్ ల్యాబ్స్ వంటి ఇతర వ్యాపారాల్లో కూడా జీత్ అదానీ పాలు పంచుకుంటున్నాడు.