Corona Treatment: కరోనా రోగుల చికిత్సకు మార్గదర్శకాలను సవరించిన కేంద్ర ఆరోగ్యశాఖ

తేలికపాటి, మధ్యస్థ, తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారికి అందించాల్సిన వైద్యం, మందులపై కేంద్ర ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది.

Corona Treatment: కరోనా రోగుల చికిత్సకు మార్గదర్శకాలను సవరించిన కేంద్ర ఆరోగ్యశాఖ

Icmer

Corona Treatment: దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. బాధితులకు అందించే చికిత్సా విధానంపై కేంద్ర ఆరోగ్యశాఖ సరికొత్త మార్గదర్శకాలు జారీచేసింది. తేలికపాటి, మధ్యస్థ, తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారికి అందించాల్సిన వైద్యం, మందులపై కేంద్ర ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది. కరోనాతో బాధపడుతూ తీవ్ర లక్షణాలతో 10 రోజులకుపైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్​ రోగులకు రెమ్​డెసివర్​ వినియోగించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఆరోగ్యశాఖ నిర్ధారించిన అన్ని ప్రమాణాలు చేరుకున్నప్పుడే అత్యవసర వినియోగం కింద రెమ్​డెసివిర్​, టోసిలిజుమాబ్​ మందులను వినియోగించాలని పేర్కొంది.

Also read: Hyderabad Crime: పాతబస్తీలో దారి కాచి యువకుడిపై కత్తులతో దాడి

కరోనాతో ఆసుపత్రిలో చేరిన రోగులకు ఐదు రోజుల పాటు రెమ్​డెసివిర్​ వినియోగించాలని తెలిపిన ఆరోగ్యశాఖ.. ఆక్సిజన్​ సపోర్ట్​ అవసరం లేనివారికి, ఇన్​హోమ్​ సెట్టింగ్​లో (ఇంటివద్ద చికిత్స) లేని వారికి రెమ్​డెసివిర్ ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. RFT మరియు LFTని పర్యవేక్షించుకోవాలి. (eGFR<30ml/min/m2; AST/ALT >5 రెట్ల UNL ఉన్నవారికి రెమ్‌డెసివిర్ సిఫార్సు చేయబడలేదు).
రెమ్​డెసివిర్ సిఫార్సు చేసిన మోతాదు: మొదటి రోజు 200 mgIV మిగతా నాలుగు రోజులు 100mgIV మోతాదులో ఇవ్వాలి.

Also read: AP Govt. Vs Employees: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్‌

ఇక కొవిడ్​ బారిన పడి ఆక్సిజన్​ సపోర్ట్​ లేదా ఐవీఎం అవసరమై, స్టెరాయిడ్స్​కు స్పందించని వారికి మాత్రమే టోసిలిజుమాబ్​ను సూచించాలి. వైరస్ తో తీవ్రంగా ప్రభావితమై ఐసీయూలో చేరాల్సి వచ్చిన వారికి 24-48 గంటల్లోపు వినియోగిస్తే మంచిదని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. టీబీ, ఫంగల్​, సిస్టెమిక్​ బ్యాక్టీరియల్​ ఇన్​ఫెక్షన్​ లేని వారికి మాత్రమే రెమ్​డెసివర్, టోసిలిజుమాబ్ మందులు ఇవ్వాలి. 60 ఏళ్లకు పైబడి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయ వ్యాధులతో బాధపడుతున్న వారిని హైరిస్క్​ కేటగిరీలోకి తీసుకోవాలని కేంద్రం పేర్కొంది. టోసిలిజుమాబ్​ సిఫార్సు చేయబడిన మోతాదు: 4-6 mg/kg (60 కిలోల బరువున్న పెద్దలకు 400 mg) గంట వ్యవధిలో 100 ml NS ఇవ్వాలి.

Also read: Chandrababu: మాజీ సీఎం చంద్రబాబుకు కొవిడ్ పాజిటివ్