బీచ్ లకు వెళ్లొద్దు : పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

  • Published By: veegamteam ,Published On : September 21, 2019 / 09:51 AM IST
బీచ్ లకు వెళ్లొద్దు : పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర,కుచ్ ల ప్రాంతాల్లో శనివారం (సెప్టెంబర్ 21)న  భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవులతో పాటు మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్,మిజోరాం రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోను..త్రిపుర, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, గోవా, తమిళనాడు రాష్ట్రాల్లోను.. పుదుచ్చేరి, కరైకల్ మీదుగా పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఆల్ ఇండియా వెదర్ వార్నింగ్ బులిటెన్ లో వాతావరణ శాఖ తెలిపింది.

ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు..గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. దీంతో సముద్ర తీర ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని సూచించింది. తూర్పు-మధ్య  అరేబియా సముద్ర తీర ప్రాంతాలో బలమైన గాలులు వీస్తాయని రెండు రోజుల పాటు ప్రజలు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లవందని హెచ్చరించింది.